క్రీడాభూమి

అండర్-19 వనే్డ క్రికెట్ సిరీస్ రాణా, హార్విక్ అర్ధ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 1: అండర్-19 క్రికెట్ వనే్డ సిరీస్‌పై భారత్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఓపెనర్ హిమాంశు రాణా, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ హార్విక్ దేశాయ్ అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. ఆతర్వాత కెప్టెన్ అనుకుల్ రాయ్ మూడు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఓపెనర్ రాణా రెండో వనే్డలోనూ బాధ్యతాయుతంగా ఆడి, 66 బంతుల్లో, 10 ఫోర్ల సాయంతో 58 పరుగులు సాధించాడు. మిడిల్ ఆర్డర్‌లో హార్విక్ 62 బంతల్లో 75 పరుగులు చేశాడు. అతని స్కోరులోనూ 10 ఫోర్లు ఉన్నాయి. కమలేష్ నగర్‌కోటి అజేయంగా 36 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ మాట్ ఫిషర్ 44 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టగా, హెన్రీ బ్రూక్స్ 60 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.
నగర్‌కోటి తొలి దెబ్బ
భారత్‌ను ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి 288 పరుగులు సాధించాల్సిన ఇంగ్లాండ్‌ను ఆల్‌రౌండర్ నగర్‌కోటి తొలి దెబ్బతీశాడు. ఓపెనర్ మాక్స్ హోల్డెన్ పరుగుల ఖాతాను తెరవకుండానే నగర్‌కోటి బౌలింగ్‌లో వికెట్‌కీపర్ హార్విక్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. మొదటి వికెట్ కూలిన తర్వాత ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. మిడిల్ ఆర్డర్‌లో డెల్రే రాలిన్స్ 35 బంతుల్లో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ హారీ బ్రూక్ 26 పరుగులు సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో ఇంగ్లాండ్ అండర్-19 జట్టు ఏకంగా 129 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.