క్రీడాభూమి

శ్రీలంకతో టి-20 సిరీస్ ఆస్ట్రేలియా జట్టులో క్రిస్ లిన్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఫిబ్రవరి 1: పించ్ హిట్టర్‌గా పేరు పొందిన క్రిస్ లిన్‌కు ఆస్ట్రేలియా టి-20 జట్టులో స్థానం దక్కింది. శ్రీలంకతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ ఆడుతుంది. మొదటి మ్యాచ్ 17న అడెలైడ్‌లో, రెండో మ్యాచ్ 19న గీలాంగ్‌లో, చివరిదైన మూడో మ్యాచ్ అడెలైడ్‌లో జరుగుతాయి. కాగా, ఇటీవల జరిగిన బిగ్ బాష్‌లో బ్రిస్బేన్ హీట్స్‌కు వెన్నుముకగా నిలిచిన క్రిస్ లిన్ మెడనొప్పి కారణంగా సెమీ ఫైనల్‌లో ఆడలేదు. ఆ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ చేతిలో బ్రిస్బేన్ హీట్స్ ఓటమిపాలైంది. క్రిస్ లిన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మొదటి మ్యాచ్ ఆరంభమయ్యేలోగా అతను ఫిట్నెస్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇలావుంటే, కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను భారత్ టూర్‌ను దృష్టిలో ఉంచుకొని విశ్రాంతినివ్వగా, జట్టులోకి మైఖేల్ క్లింగర్, బిల్లీ స్టాన్‌లేక్, జే రిచర్డ్‌సన్, ఆస్టన్ టర్నర్ తమతమ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. మిగతా వారి విషయం ఎలావున్నా, 36 ఏళ్ల టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ క్లింగర్ ఎంపిక మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కాగా ఈ జట్టుకు ఆరోన్ ఫించ్ నాయకత్వం వహిస్తాడు.
శ్రీలంకతో టి-20 సిరీస్‌కు
ఆస్ట్రేలియా జట్టు ఇదే..
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్రిక్ కమిన్స్, జేమ్స్ ఫాల్క్‌నెర్, ట్రావిస్ హెడ్, మోజెర్ హెన్రిక్స్, మిఖేల్ క్లింగర్, క్రిస్ లిన్, టిమ్ పైన్, జే రిచర్డ్‌సన్, బిల్లీ స్టున్‌లేక్, ఆస్టన్ టర్నర్, ఆండ్రూ టయే, ఆడం జంపా.

ఆసీస్ కీపర్ వేడ్‌కు గాయం
జట్టుకు ఇక ఫించ్ నాయకత్వం
సిడ్నీ, ఫిబ్రవరి 1: వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ గాయపడడంతో, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్‌ని వరించింది. రెగ్యులర్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ గాయపడగా, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వాలని ఆసీస్ సెలక్టర్లు నిర్ణయించారు. దీనితో జట్టుకు కెప్టెన్‌గా వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ ఎంపికయ్యాడు. అయితే, కివీస్‌తో జరిగిన మొదటి వనే్డ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతను గాయపడ్డాడు. మొదటి వనే్డలో అతని స్థానంలో జట్టుకు ఫించ్ నాయకత్వం వహించాడు. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. కాగా, వేడ్ గాయాన్ని పరీక్షించిన వైద్యులు అతనికి విశ్రాంతి అవసరమని సూచించారని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అతను మిగతా రెండు వనే్డలకు అందుబాటులో ఉండడని, కాబట్టి ఫించ్ కెప్టెన్సీ కొనసాగుతుందని వివరించింది. కివీస్‌తో రెండో వనే్డ గురువారం జరుగుతుంది.