క్రీడాభూమి

చాహల్ ‘సిక్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 1: సిరీస్‌ను ఖరారు చేసే చివరి, మూడో టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడింది. యుజువేంద్ర చాహల్ కేవలం 25 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి, భారత్ ఘన విజయానికి తోడ్పడ్డాడు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని గెల్చుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడో మ్యాచ్‌నీ సొంతం చేసుకొని, సిరీస్‌ను 2-1 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా విజృంభణకు బెంబేలెత్తిన ఇంగ్లాండ్ 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై, 16.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది.
బ్యాటింగ్ బలంపై నమ్మకంతో లక్ష్యాన్ని ఛేదించడానికే మొగ్గుచూపిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నాలుగు పరుగుల స్కోరువద్ద ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ను కోల్పోయింది. అతను నాలుగు బంతులు ఎదుర్కొని, రెండు పరుగులు చేసి రనౌటయ్యాడు. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 18 బంతుల్లో 22 పరుగులు (2 ఫోర్లు, ఒక సిక్స్) చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 65 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన దశలో సురేష్ రైనా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ అర్ధ శతకాలు సాధించడంతో భారత్ కోలుకుంది. రైనా 36 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 63 పరుగులు చేసి, లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో ఇయాన్ మోర్గాన్‌కు దొరికిపోయాడు. యువరాజ్ సింగ్ కేవలం 10 బంతుల్లో 27 పరుగులు చేసి టైమల్ మిల్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జొస్ బట్లర్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అతని స్కోరులో ఒక ఫోర్, మూడు సిక్సర్లు ఉన్నాయి. కెరీర్‌లో తొలి టి-20 ఆడిన రిషభ్ పంత్ ఆరు పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, హార్దిక్ పాండ్య నాలుగు బంతుల్లో 11 పరుగులు సాధించి, ఇన్నింగ్స్ చివరి బంతిలో రనౌటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లు టైమల్ మిల్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ ప్లంకెట్, బెన్ స్టోక్స్ తలా ఒక వికెట్ కూల్చారు.
కుప్పకూలిన మిడిల్ ఆర్డర్
ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో, ఆ జట్టుకు 75 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. కేవలం ఎనిమిది పరుగుల స్కోరువద్ద సామ్ బిల్లింగ్స్ (0) వికెట్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్ జాసన్ రాయ్ (32), జో రూట్ (42), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40) కొంత వరకూ అండగా నిలిచారు. కానీ, 119 పరుగుల స్కోరువద్ద మోర్గాన్ వికెట్ కూలగా, ఆతర్వాత ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. దీనితో ఇంగ్లాండ్ ఎలాంటి పోరాటం చేయకుండానే ఓటమిని అంగీకరించింది.

హఠాత్తుగా పతనం
భారత్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ఊపుమీద కనిపించిన ఇంగ్లాండ్ హఠాత్తుగా చేతులెత్తేసింది. ఇయాన్ మోర్గాన్ అవుటైనప్పుడు స్కోరు 119. ఆతర్వాత కేవలం 12 పరుగుల తేడాలోనే ఆ జట్టు మిగతా ఏడు వికెట్లను కూడా కోల్పోయింది. యుజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా 18 బంతుల్లో ఏడు వికెట్లు పంచుకున్నారు. చాహల్ ఆరు వికెట్లు పడగొడితే, బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. చివరి టి-20ని భారత్‌కు అనుకూలంగా మార్చేసి, తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టిన ఘనత చాహల్, బుమ్రాకే దక్కుతుంది.

స్కోరుబోర్డు

భారత్ ఇన్నింగ్స్: విరాట్ కోహ్లీ రనౌట్ 2, లోకేష్ రాహుల్ బి బెన్ స్టోక్స్ 22, సురేష్ రైనా సి ఇయాన్ మోర్గాన్ బి లియామ్ ప్లంకెట్ 63, మహేంద్ర సింగ్ ధోనీ సి అదిల్ రషీద్ బి క్రిస్ జోర్డాన్ 56, యువరాజ్ సింగ్ సి జొస్ బట్లర్ బి టైమల్ మిల్స్ 27, రిషభ్ పంత్ 6 నాటౌట్, హార్దిక్ పాండ్య రనౌట్ 11, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 202.
వికెట్ల పతనం: 1-4, 2-65, 3-120, 4-177, 5-191, 6-202.
బౌలింగ్: టైమల్ మిల్స్ 4-0-32-1, క్రిస్ జోర్డాన్ 4-0-56-1, లియామ్ ప్లంకెట్ 2-0-22-1, బెన్ స్టోక్స్ 4-0-32-1, మోయిన్ అలీ 4-0-30-0, అదిల్ రషీద్ 2-0-23-0.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ సి ధోనీ బి అమిత్ మిశ్రా 32, సామ్ బిల్లింగ్స్ సి సురేష్ రైనా బి యుజువేంద్ర చాహల్ 0, జో రూట్ ఎల్‌బి యుజువేంద్ర చాహల్ 42, ఇయాన్ మోర్గాన్ సి రిషభ్ పంత్ బి యుజువేంద్ర చాహల్ 40, జొస్ బట్లర్ సి విరాట్ కోహ్లీ బి జస్‌ప్రీత్ బుమ్రా 0, బెన్ స్టోక్స్ సి సురేష్ రైనా బి యుజువేంద్ర చాహల్ 6. మోయిన్ అలీ సి విరాట్ కోహ్లీ బి యుజువేంద్ర చాహల్ 2, లియామ్ ప్లంకెట్ బి జస్‌ప్రీత్ బుమ్రా 0, క్రిస్ జోర్డాన్ స్టంప్డ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 0, అదిల్ రషీద్ 0 నాటౌట్, టైమల్ మిల్స్ సి విరాట్ కోహ్లీ బి జస్‌ప్రీత్ బుమ్రా 0, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (16.3 ఓవరర్లలో) 127 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-8, 2-55, 3-119, 4-119, 5-119, 6-122, 7-127, 8-127, 9-127, 10-127.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 3-1-24-0, యుజువేంద్ర చాహల్ 4-0-25-6, జస్‌ప్రీత్ బుమ్రా 2.3-0-14-3, అమిత్ మిశ్రా 4-0-23-1, హార్దిక్ పాండ్య 2-0-17-0, సురేష్ రైనా 1-0-22-0.