క్రీడాభూమి

కెప్టెన్‌కు ధోనీ పాఠాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 2: పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగిన మహేంద్ర సింగ్ ధోనీ టీచర్ అవతారం ఎత్తాడు. టెస్టు కెప్టెన్‌గా కొంత అనుభవం ఉన్నప్పటికీ, వనే్డ, టి-20 ఫార్మాట్లలో జట్టుకు మొదటిసారి పూర్తికాల సారథిగా బాధ్యతలు నిర్వరిస్తున్న విరాట్ కోహ్లీకి పాఠాలు చెప్తున్నాడు. తానే స్వయంగా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, అంతా తానై నడిపిస్తున్నాడు ‘జార్ఖండ్ డైనమెట్’ ధోనీ. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో, ఆతర్వాత టి-20 సిరీస్‌లో ఈ విషయం స్పష్టమైంది. అత్యంత కీలక సమయాల్లో, ప్రత్యేకించి డెత్ ఓవర్లలో ఫీల్డింగ్‌ను ధోనీ సరి చేస్తున్నాడు. చివరికి బౌలింగ్ బాధ్యతను ఎవరికి అప్పగించాలన్న విషయంలోనూ అతను నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే, డిఆర్‌ఎస్‌లోనూ కెప్టెన్ కోహ్లీకి చెప్పకుండానే, అతని అనుమతి తీసుకోకుండానే అప్పీల్ చేస్తున్నాడు. అయితే, ధోనీ వైఖరిని కోహ్లీ తప్పుపట్టకపోగా, సమర్థిస్తున్నాడు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అతనికి బాగా తెలుసునంటూ కితాబునిస్తున్నాడు. ధోనీ అపారమైన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నదని అతను వ్యాఖ్యానిస్తున్నాడు. టి-20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిన భారత్, రెండో మ్యాచ్‌ని గెల్చుకున్న విషయం తెలిసిందే. దీనితో చివరిదైన మూడో మ్యాచ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని టీమిండియా 75 పరుగుల తేడాతో కైవసం చేసుకొని, సిరీస్‌ను 2-1 ఆధిక్యంతో తన ఖాతాలో వేసుకోవడంలో ధోనీ పాత్ర కూడా ఉంది. యుజువేంద్ర చాహల్ ఆరు వికెట్లు పడగొట్టడం, జస్‌ప్రీత్ బుమ్రా కూడా అద్భుతంగా రాణించడం ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టిన మాట వాస్తవమే. అయితే, చాహల్ ఓవర్ల కోటా పూర్తయిన వెంటనే హార్దిక్ పాండ్యకు బౌలింగ్‌ను ఇవ్వాలని కోహ్లీ అనుకున్నాడు. కానీ, వద్దంటూ ధోనీ వారించాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు బంతిని ఇవ్వాల్సిందిగా సూచించాడు. సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా ధోనీ సూచనను బలపరచడంతో కోహ్లీ వారి మాటకు విలువనిచ్చాడు. ఆ నిర్ణయం సరైందనని రుజువైంది. బుమ్రా మూడు బంతుల తేడాలో రెండు వికెట్లు పడగొట్టి, మ్యాచ్‌ని పూర్తి చేశాడు. ‘ప్రస్తుత పరిస్థితులను బట్టి, మ్యాచ్‌ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే 19వ ఓవర్ వరకూ వేచి ఉండడంలో అర్థం లేదని ధోనీ అన్నాడు. కీలక బౌలర్లను రంగంలోకి దించాల్సిన సమయం అదేనని స్పష్టం చేశాడు. అతని సూచనతో జట్టు ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. అత్యంత సున్నితమైన పరిస్థితుల్లో వ్యూహాలు ఏ విధంగా ఉండాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని? అన్న ప్రశ్నలకు సమాధానాలు ధోనీ వద్ద ఉంటాయి. అతని అనుభవం జట్టుకు లాభిస్తున్నది’ అని పిటిఐతో మాట్లాడుతూ కోహ్లీ అన్నాడు.
తాను కెప్టెన్సీకి కొత్తకాదని, అయినప్పటికీ, కొన్ని అంశాల్లో చేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయని వ్యాఖ్యానించాడు. తాము అనుకున్న విధంగానే ఫలితాన్ని రాబట్టగలిగామని ఆనందం వ్యక్తం చేశాడు. మొత్తం మీద ఇంగ్లాండ్‌తో వనే్డ, టి-20 సిరీస్‌లకు ముందే కెప్టెన్సీని నుంచి ధోనీ వైదొలగినప్పటికీ, కీలక సమయాల్లో తానే జట్టును నడిపించాడు. ఒక రకంగా పరోక్షంగా అతనే నాయకత్వం వహించాడు. ఈ రెండు సిరీస్‌లను భారత్ గెల్చుకోవడంలో తనదైన ముద్ర వేశాడు. అదే సమయంలో కోహ్లీకి కెప్టెన్సీ పాఠాలు నేర్పా డు. తన అనుభవాన్ని పంచుతున్నాడు.

చిత్రం..మహేంద్ర సింగ్ ధోనీ