క్రీడాభూమి

రికీ భుయ్ శ్రమ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 2: రికీ భుయ్ ఒంటరి పోరాటం కొనసాగించి, 44 ఓవర్లలో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు చేసినప్పటికీ, కెప్టెన్ హనుమ విహారి (37) తప్ప మిగతా వారు రాణించలేకపోవడంతో ఆంధ్ర జట్టు ఓటమిపాలైంది. ముస్తాక్ అలీ అంతర్ రాష్ట్ర టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా, సౌత్‌జోన్ విభాగంలో తమిళనాడుతో పోటీపడిన ఆంధ్ర 37 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేయగా, అంధ్ర 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులకే పరిమితమైంది.
హైదరాబాద్ పరాజయం
ఇదే విభాగంలో కర్నాటకను ఢీకొన్న హైదరాబాద్ కూడా పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాటక 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగా, హైదరాబాద్ ఆరు వికెట్లకు 134 పరుగులు చేసి, 14 పరుగుల తేడాతో ఓడింది.
ఇతర మ్యాచ్‌ల్లో పంజాబ్ 23 పరుగుల ఆధిక్యంతో హిమాచల్ ప్రదేశ్‌ను ఓడించింది. ఉత్తర ప్రదేశ్‌పై రైల్వేస్ 90 పరుగుల తేడాతో గెలిచింది. హోరాహోరీగా సాగిన పోరులో హర్యానాపై జమ్మూ కాశ్మీర్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. బరోడాను సౌరాష్ట్ర మూడు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ముంబయి ఆరు వికెట్ల ఆధిక్యంతో మహారాష్టప్రై గెలిచింది. శిఖర్ ధావన్ అజేయంగా 82 పరుగులు చేయగా, సర్వీసెస్‌పై ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. చత్తీస్‌గఢ్‌ను రాజస్తాన్ 25 పరుగుల తేడాతో, గోవాను కేరళ 9 వికెట్ల తేడాతో ఓడించాయి.

చిత్రం.. రికీ భుయ్