క్రీడాభూమి

చాహల్‌పై ప్రశంసల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 2: భారత యువ లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీసహా పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి, మూడో టి-20లో అసాధారణ ప్రతిభ కనబరచిన చాహల్ 25 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సంపాదించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గానూ అతను ఎంపికయ్యాడు. టి-20 ఫార్మాట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అతను చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. 2011 ఆగస్టు 8న పల్లేకల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి, 16 పరుగులకు ఆరు వికెట్లు కూల్చాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌పై లంకను గెలిపించాడు. చాహల్ కూడా అదే స్థాయి ప్రతిభ కనబరచి, విమర్శకుల ప్రశంసలు పొందాడు. బెంగళూరు మైదానం ఎప్పుడూ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలిస్తుంది. అలాంటి పిచ్‌పై, ఒక స్పిన్నర్ రాణించడం అనుకున్నంత సులభం కాదు. అందులోనూ, బంతి పాతబడిన తర్వాత గొప్పగా స్పిన్ చేయవచ్చేమోగానీ కొత్త బంతితో సాధ్యం కాదు. కానీ, తనకు ఏదీ అసాధ్యం కాదని చాహల్ నిరూపించాడు. ఆరంభంలో కొత్త బంతితో బౌలింగ్ చేయమని కెప్టెన్ కోహ్లీ ఆదేశం ప్రకారం బౌలింగ్‌కు దిగిన అతను తన మొదటి ఓవర్ మూడో బంతికే సామ్ బిల్లింగ్స్ వికెట్ సాధించాడు. ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు. చివరిలో అతను విజృంభించిన తీరు అనన్యసామాన్యం. ఈ ప్రతిభే అతనికి ప్రత్యేకతను సంపాదించిపెట్టింది.

చిత్రం.. యుజువేంద్ర చాహల్