క్రీడాభూమి

టి-20ల్లో కోహ్లీ నంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఫిబ్రవరి 2: టి-20 ఫార్మాట్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా వెలుగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్, బ్యాటింగ్ విభాగంలో అతను టెస్టుల్లో రెండు, వనే్డల్లో మూడు స్థానాల్లో ఉన్నాడు. టి-20 ఫార్మాట్‌లో కోహ్లీ 799 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలవగా, ఆరోన్ ఫించ్ (771), గ్లేన్ మాక్స్‌వెల్ (783) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టెస్టుల్లో అతనికి రెండో స్థానం దక్కింది. స్టీవెన్ స్మిత్ 933 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తే, కోహ్లీ 875 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జో రూట్ (848) మూడో స్థానాన్ని సంపాదించాడు. కాగా, వనే్డ ఇంటర్నేషనల్ ప్రపంచ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక స్థానాన్ని మెరుగు పరచుకొని 13వ స్థానానికి చేరాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు కోల్పోయి 12వ స్థానానికి పడ్డాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జొస్ బట్లర్‌తో కలిసి శిఖర్ ధావన్ సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నాడు. ఇలావుంటే, బ్యాటింగ్‌లో కోహ్లీ, ఆల్‌రౌండర్స్ విభాగంలో రవీంద్ర జడేజా తప్ప భారత్ నుంచి ఎవరికీ ‘టాప్-10’లో స్థానం లభించకపోవడం గమనార్హం. జడేజా ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
బ్యాటింగ్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్
‘టాప్-10’
వనే్డ ఇంటర్నేషనల్స్
1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా/ 880 పాయింట్లు), 2. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 861 పాయింట్లు), 3. విరాట్ కోహ్లీ (్భరత్/ 852 పాయింట్లు), 4. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా/ 779 పాయింట్లు), 5. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 770 పాయింట్లు), 6. జో రూట్ (ఇంగ్లాండ్/ 753 పాయింట్లు), 7. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా/ 748 పాయింట్లు), 8. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా/ 740 పాయింట్లు), 9. మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్/ 735 పాయింట్లు), 10. బాబర్ ఆజమ్ (పాకిస్తాన్/ 733 పాయింట్లు).
టెస్టు క్రికెట్
1. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా/ 933 పాయింట్లు), 2. విరాట్ కోహ్లీ (్భరత్/ 875 పాయింట్లు), 3. జో రూట్ (ఇంగ్లాండ్/ 848 పాయింట్లు), 4. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 823 పాయింట్లు), 5. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా/ 812 పాయింట్లు), 6. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా/ 787 పాయింట్లు), 7. అజర్ అలీ (పాకిస్తాన్/ 779 పాయింట్లు), 8. యూనిస్ ఖాన్ (పాకిస్తాన్/ 772 పాయింట్లు), 9. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా/ 760 పాయింట్లు), 10. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 755 పాయింట్లు).
టి-20 ఇంటర్నేషనల్స్
1. విరాట్ కోహ్లీ (్భరత్/ 799 పాయింట్లు), 2. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా/ 771), 3. గ్లేన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా/ 763 పాయింట్లు), 4. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 758 పాయింట్లు), 5. జో రూట్ (ఇంగ్లాండ్/ 743 పాయింట్లు), 6. మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్/ 709 పాయింట్లు), 7. మహమ్మద్ షాజాద్ (అఫ్గానిస్థాన్), 8. ఫఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా/ 697 పాయింట్లు), 9. అలెక్స్ హాలెస్ (ఇంగ్లాండ్/ 664 పాయింట్లు), 10. హామిల్టన్ మసకజా (జింబాబ్వే/ 656 పాయింట్లు).

చిత్రం..విరాట్ కోహ్లీ