క్రీడాభూమి

వెస్టిండీస్ కోచ్‌గా స్టువర్ట్ లా నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జోన్స్, ఫిబ్రవరి 3: వెస్టిండీస్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ లా ఎంపికయ్యాడు. రెండేళ్లపాటు అమల్లో ఉండే ఒప్పందాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)తో కుదుర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని 48 ఏళ్ల లా ఒక ప్రకటనలో తెలిపాడు. తన కోచింగ్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిలా నిలిచిపోతుందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా తరఫున 54 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన లా, దేశవాళీ క్రికెట్‌లో 367 మ్యాచ్‌ల్లో పాల్గొని, 27,080 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్ చాలా తక్కువ సమయానికే ముగిసినప్పటికీ, కోచ్‌గా అతను రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు.