క్రీడాభూమి

కోహ్లీనే ప్రధాన శత్రువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 3: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని తమ ప్రధాన శత్రువుగా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైఖేల్ హస్సీ అభివర్ణించాడు. అయితే, అతనిని రెచ్చగొడితే దారుణ పరాభవాలు తప్పవని త్వరలో భారత్‌లో పర్యటించే ఆస్ట్రేలియా క్రికెటర్లను హెచ్చరించాడు. ఈనెల 23 నుంచి మొదలయ్యే సిరీస్‌లో కోహ్లీని ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపాలనే విషయంపై కసరత్తు చేయాలని, పటిష్టమైన వ్యూహరచనతో ముందుకు వెళ్లాలని సూచించాడు. అసాధారణ ఫామ్‌లో ఉన్న కోహ్లీని రెచ్చగొడితే, ఆతర్వాత అతని విజృంభణకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ప్రత్యర్థులను హేళన చేస్తూ, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడంలో ఆసీస్ క్రికెటర్లను మించిన వారు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆసీస్ క్రికెట్ జట్టు స్లెడ్జింగ్‌కు మారుపేరుగా పేర్కోవచ్చు. అయితే, భారత్ విషయంలో, ప్రత్యేకించి కోహ్లీ విషయంలో స్లెడ్జింగ్ బెడిసి కొడుతుందని 2013లో రిటైరైన మైక్ హస్సీ ఆసీస్ క్రికెటర్లను హెచ్చరించాడు. భారత్‌లో టీమిండియాను ఎదుర్కోవడం ఆషామాషి వ్యవహారం కాదన్నాడు. ఇప్పుడు కోహ్లీ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అతని నుంచి కష్టాలు తప్పవని అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని మైక్ హస్సీ జోస్యం చెప్పాడు.
హాల్ ఆఫ్ ఫేమ్‌లో బూన్, హేడెన్‌కు చోటు
ఆస్ట్రేలియా మాజీ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ బూన్, మాథ్యూ హేడెన్‌లకు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం లభించింది. కాగా, 1987 వరల్డ్ కప్ హీరోలకు పతకాలు లభించాయ. ఆస్ట్రేలియా 1987లో ప్రపంచ కప్‌ను గెల్చుకున్నప్పుడు జట్టులోని ఆటగాళ్లకు పాకిస్తాన్‌తో ఇక్కడ జరిగిన నాలుగో వనే్డ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో పతకాలను బహూకరించారు. అలాన్ బార్డర్ నాయకత్వంలో ఆసీస్ జట్టు ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో ఆడిన క్రికెటర్లకు ప్రశంసా బహుమతులను అందచేశారు. అదే విధంగా 1975లోలో విజేతగా నిలిచిన వెస్టిండీస్, 1996లో టైటిల్ సాధించిన శ్రీలంక జట్ల ఆటగాళ్లకు కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పతకాలను అందచేసింది.

చిత్రం..మైఖేల్ హస్సీ