క్రీడాభూమి

శ్రీలంకపై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 4: అంధుల టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజయపరంపరలను కొనసాగిస్తున్నది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ని తొమ్మిది వికెట్ల తేడాతో కైవసం చేసుకొని, తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ప్రకాష్ (99 నాటౌట్), కేతన్ పటేల్ (56 నాటౌట్) భారత్‌కు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించిపెట్టారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు చేసింది. చందన దేశప్రియ 62 పరుగులతో రాణించగా, పతుమ్ సమాన్ కుమార 30 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 13.3 ఓవర్లలోనే, ఒక వికెట్ నష్టంతో లక్ష్యాన్ని చేరింది. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.