క్రీడాభూమి

డేవిస్ కప్ టెన్నిస్ పేస్‌కు నిరాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 4: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆసియా ఓషియానియా గ్రూప్ డేవిస్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం విష్ణు వర్ధన్‌తో కలిసి బరిలోకి దిగిన భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌కు నిరాశే మిగిలింది. డేవిస్ పోటీల్లో ఇప్పటి వరకూ 42 డబుల్స్ మ్యాచ్‌లను గెలిచిన పేస్ మరో విజయాన్ని సాధిస్తే, అత్యధిక విజయాలను అందుకున్న ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించి ఉండేవాడు. కానీ, పేస్, విష్ణువర్ధన్ జోడీపై కివీస్ జోడీ అర్టెమ్ సిటాక్, మైఖేల్ వీనస్ జోడీ 3-6, 6-3, 7-6, 6-3 తేడాతో గెలిచింది. దీనితో రికార్డు కోసం పేస్ మళ్లీ డేవిస్ కప్ పోరు జరిగే వరకూ ఎదురుచూడక తప్పదు.

చిత్రం..విష్ణువర్థన్, లియాండర్ పేస్