క్రీడాభూమి

న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 5: డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా ఓషియానియా గ్రూప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించింది. రామనాథన్ రాంకుమార్ ఆదివారం జరిగిన కీలకమైన రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ఫిన్ టియర్నీని 7-5, 6-1, 6-0 తేడాతో చిత్తుచేసి భారత్‌కు తిరుగులేని రీతిలో 3-1 ఆధిక్యాన్ని అందించాడు. అంతకు ముందు సింగిల్స్‌లో అతను జొస్ స్ట్థామ్‌ను 6-3, 6-4, 6-3 ఆధిక్యంతో ఓడించిన విషయం తెలిసిందే. మొదటి సింగిల్స్‌లోనే యుకీ భంబ్రీ 6-4, 6-4, 6-3 తేడాతో ఫిన్ టియర్నీపై గెలవడంతో భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే, డబుల్స్ విభాగంలో జాతీయ చాంపియన్ విష్ణువర్ధన్, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ జోడీ అనూహ్యంగా ఓటమిపాలైంది. వీరిపై మైఖేల్ వీనస్, ఆర్టెన్ సిటాక్ జోడీ 3-6, 6-3, 7-6, 6-3 ఆధిక్యంతో గెలిచి, భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. దీనితో ఆదివారం నాటి మొదటి రివర్స్ సింగిల్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మ్యాచ్ మొదటి సెట్‌ను రాంకుమార్ అతి కష్టం మీద గెల్చుకున్నాడు. తర్వాతి రెండు సెట్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా తన ఖాతాలో వేసుకొని, కివీస్‌పై భారత్‌ను గెలిపించాడు. ఇక ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిన చివరి రివర్స్ సింగిల్స్‌లో యుకీ భంబ్రీ 7-5, 3-6, 6-4 ఆధిక్యంతో జొస్ స్ట్థామ్‌ను ఓడించి, భారత్ ఆధిక్యాన్ని 4-1కి పెంచాడు.

చిత్రం. రామనాథన్ రాంకుమార్