క్రీడాభూమి

దూకుడు నాకు వారసత్వంగా వచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దూకుడుగా వ్యవహరించడం తనకు వారసత్వంగా వచ్చిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. తన మాదిరిగానే తన తండ్రిది కూడా సింహ రాశేనని, అందుకే ఆయనకు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుందని చెప్పాడు. అవే లక్షణాలు తనకు కూడా వచ్చాయని అన్నాడు.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
మెంటర్‌గా సెవాగ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్న సంజయ్ బంగార్‌తో కలిసి అతను పని చేయనున్నాడు. గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన సెవాగ్ ఇప్పుడు మెంటర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సంజయ్ బంగార్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికి అపారమైన అనుభవం ఉందని సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. జట్టులోని యువ ఆటగాళ్లకు అతని సూచనలు, సలహాలు, మార్గదర్శకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు.

ఫిట్నెస్ లేని ఫించ్!
మెల్బోర్న్, ఫిబ్రవరి 1: ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు. భారత్‌తో చివరి టి-20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎడమ చేతి కండరాలు బెణకడంతో ఇబ్బంది పడిన అతనికి వైద్య పరీక్షలు జరిపించినట్టు ఆస్ట్రేలియా పిజియోథెరపిస్టు అలెక్స్ కౌంటొరిస్ ప్రకటించాడు. ఫించ్‌కి శస్తచ్రికిత్స అవసరం లేదని వైద్యులు స్పష్టం చేసినట్టు తెలిపాడు. అతను వేగంగా కోలుకుంటున్నాడని, వచ్చేనెల భారత్‌లో జరిగే టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ నాటికి పూర్తి ఫిట్నెస్‌తో ఉంటాడన్న నమ్మకం తనకు ఉందని కౌంటొరిస్ అన్నాడు. కాగా, కాలి కండరాలు చిట్లిన కారణంగా గత ఏడాది ఏప్రిల్ మాసంలో ఫించ్ ఒకసారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అలాంటి పరిస్థితే మరోసారి తలెత్తే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) మాత్రం ఫించ్ గాయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
భారత్‌కే విజయావకాశాలు: వాట్సన్
సిడ్నీ: టి-20 వరల్డ్ కప్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. సోమవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ స్వదేశంలో టోర్నీ జరగనుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశమన్నాడు. అక్కడి వాతావరణం, పిచ్‌ల తీరు భారత క్రికెటర్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించాడు. ఎప్పుడైనా హోం అడ్వెంటేజ్ బలంగా పని చేస్తుందన్నాడు. ఇటీవల భారత్ చేతిలో టి-20 సిరీస్‌లో వైట్‌వాష్ వేయించుకున్న అంశాన్ని ప్రస్తావించగా, గతాన్ని తలచుకోవడంలో అర్థం లేదన్నాడు. టి-20 వరల్డ్ కప్‌లో గట్టిపోటీనిస్తామని అన్నాడు.