క్రీడాభూమి

ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: బంగ్లాదేశ్‌తో జరగబోయే ఒక టెస్టులో కూడా భారత జట్టు తన గెలుపు జోరును అలాగే కొనసాగించాలని అనుకుంటోందని జట్టు సభ్యుడు, బ్యాట్స్‌మన్ అయిన చతేశ్వర్ పుజారా చెప్పాడు. అయితే బంగ్లాదేశ్ జట్టును తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని కూడా ఆయన హెచ్చరించాడు. బంగ్లాదేశ్ గత ఏడాది టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిందని, అందువల్ల ఈ నెల 9నుంచి ఇక్కడ జరగబోయే మ్యాచ్‌లో ఆ జట్టును తేలిగ్గా తీసుకోరాదని అన్నాడు. ముఖ్యంగా ఉపఖండంలో బంగ్లాదేశ్ జట్టు బాగా ఆడుతోందని అన్నాడు. ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలో టెస్టుల్లో నంబర్ వన్ స్థానంలో ఉందని, అందువల్ల 2016లో తాము ఎలా ఆడామో, 2017లో కూడా అదే తీరును కొనసాగించాలని అనుకుంటున్నట్లు పుజారా సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. బంగ్లాదేశ్‌పై ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై తాము తర్వాత చర్చించుకోవలసి ఉందని అంటూ, అయితే తాము బాగా ఆడితే బంగ్లాదేశ్‌ను తప్పకుండా ఓడించగలుగుతామన్నాడు. ఏది ఏమయినా ఇది మంచి పోటీ అవుతుందని తాను అనుకుంటున్నట్లు పుజారా చెప్పాడు.