క్రీడాభూమి

8 ఏళ్లలోపు చిన్నారుల కోసం సానియా టెన్నిస్ అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా మూడునుంచి ఎనిమిదేళ్ల మధ్య వయసుండే చిన్నరుల కోసం ఒక టెన్నిస్ అకాడమీని సోమవారం ప్రారంభించింది. ‘ఎస్‌ఎంటిఏ గ్రాస్‌రూట్ టెన్నిస్ అకాడమీ’ పేరుతో ప్రారంభించిన ఈ అకాడమీ ఆలోచన వాస్తవానికి తన తల్లి, స్నేసితుల ఆలోచన అని ఈ సందర్భంగా సానియా చెప్పింది. ఒక టెన్నిస్ క్రీడాకారిణిగా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎక్కడకి వెళ్లాలి లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్తూ, ఒక కుటుంబంగా ఇలాంటి వారికి తమకు చేతనయినంత మేరకు సాయం చెయ్యాలన్నదే తమ ఉద్దేశమని సానియా ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ సానియా చెప్పింది. 2013లో సానియా మీర్జా ఒక టెన్నిస్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిన్నారులకోసం ప్రత్యేకంగా ఈ అకాడమీని ప్రారంభించింది. ఈ రోజుల్లో టెన్నిస్‌లో పోటీ విపరీతంగా ఉందని, ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసులో ప్రాక్టీస్ ప్రారంభించాలంటే ఇబ్బంది అవుతుందని, అందువల్ల మూడు నాలుగేళ్ల వయసునుంచే ప్రారంనించాల్సిన పరిస్థితి ఉందని ఆమె చెప్పింది. అంతేకాదు టెన్నిస్‌లో గొప్పగొప్ప వాళ్లంతా కూడా నాలుగైదేళ్ల వయసునుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టన వారేనని ఆమె చెప్పింది. అయితే అంత చిన్న వయసులో అన్ని సదుపాయాలు ఉండే అకాడమీ కోసం సిటీ బయటికి వెళ్లాలంటే కష్టమని, ఈ అకాడమీ నగరంలోపలే ఉంటుందని చెప్పింది. ఇది తన ఇంటి పక్కనే ఉంటుందని, తాను కూడా దీనికోసం కొంత సమయం వెచ్చిస్తానని ఆమె చెప్పింది.

చిత్రం..అకాడమీ వివరాలు వెల్లడిస్తున్నహైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా