క్రీడాభూమి

ఇండియా-ఏ బ్యాట్స్‌మెన్ ధాటికి విలవిల్లాడిన బంగ్లాదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును రెండు రోజుల సన్నాహక మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు గడగడలాడించింది. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల నష్టానికి 224 పరుగుల స్కోరు వద్ద బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఏ ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు సాధించిన విషయం విదితమే. ఆ స్కోరుతో సోమవారం చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా-ఏ జట్టులో ఓపెనర్ పికె.పాంచాల్ (103), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ (100) సెంచరీలతో హోరెత్తించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా, లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ వి.శంకర్ (103) కూడా అజేయ శతకంతో సత్తా చాటుకున్నాడు. దీంతో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 461 పరుగులు సాధించిన తర్వాత ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుభాశిష్ రాయ్, తైజుల్ ఇస్లామ్ చెరో మూడు వికెట్లు రాబట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ (25)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ మొమినుల్ హక్ (0)లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు పంపగా, ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (42), మహ్మదుల్లా (1) అజేయంగా నిలిచారు. దీంతో చివరి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 73 పరుగులు రాబట్టడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

చిత్రం.. పికె.పాంచాల్