క్రీడాభూమి

అభిమానుల ఆశలన్నీ సింధు, సైనాపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: వియత్నాంలో ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న తొలి ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్ బాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో ‘తెలుగు తేజం’, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి.సింధుతో పాటు లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు చోటు కల్పించారు. గత వారం లక్నోలో ముగిసిన సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకున్న సింధు, అలాగే మలేసియా మాస్టర్స్ టైటిల్‌తో ప్రస్తుత సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన సైనా నెహ్వాల్ ఈ పోటీల్లో మహిళల సింగిల్స్ బాధ్యతలను పంచుకోనున్నారు. వీరితో పాటు మన జట్టులో తన్వీ లాడ్, రీతూపర్ణా దాస్‌కు కూడా జట్టులో ఉన్నప్పటికీ ఈ పోటీల్లో మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఒక్కో మ్యాచ్‌ను మాత్రమే నిర్వహించనుండటంతో వారు బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు.
గత ఏడాది హాంకాంగ్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరడంతో పాటు సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రీ గోల్డ్ టోర్నీలో విజేతగా నిలిచిన సమీర్ వర్మ ఈ పోటీల్లో భారత పురుషుల సింగిల్స్ విభాగానికి సారథ్యం వహించనుండగా, స్విస్ ఓపెన్ చాంపియన్ హెచ్‌ఎస్.ప్రణయ్ మరో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే మరో అనుభవజ్ఞుడైన ఆటగాడైన కిదాంబి శ్రీకాంత్ ఈ పోటీల్లో పాల్గొనడం లేదు. ఈ ఈవెంట్‌కు దూరంగా ఉండాలని అతను నిర్ణయించుకున్నాడు. ఇక పురుషుల డబుల్స్ విభాగంలో రియో ఒలింపియన్లు బి.సుమీత్ రెడ్డి, మను అత్రితో పాటు మరో యువ జోడీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి మన దేశానికి ప్రాతినిథ్యం వహించనుండగా, లక్నోలో తొలిసారి గ్రాండ్‌ప్రీ గోల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కీ రెడ్డి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో దేశానికి విజయాన్ని అందించాలని ఎదురు చూస్తున్నారు. కాగా, సిక్కీరెడ్డి మహిళల డబుల్స్ విభాగంలో అశ్వనీ పొన్నప్పతో కలసి బరిలోకి దిగనుంది. కొత్తగా జోడీ కట్టిన వీరిద్దరూ ఈ పోటీల్లో తమకంటే ఎంతో అనుభవజ్ఞులైన జంటలతో తలపడనున్నారు. ఆసియాలో ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణిస్తున్న మిక్స్‌డ్ బాడ్మింటన్ టీమ్ టోర్నమెంట్ ట్రోఫీ కోసం చైనా, కొరియా, జపాన్, మలేసియా, భారత్ సహా మొత్తం 13 దేశాల జట్లు పోటీపడనున్నాయి.

‘తెలుగు తేజం’ సింధు, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ (ఫైల్ ఫొటో)