క్రీడాభూమి

చితక్కొట్టుడు.. అంటే ఇదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: టెస్టుల్లో త్రిశతకం చేయడం ఎంతో కష్టమైన పని. వనే్డల్లో అయితే ద్విశతకం చేయడమంటే మాటలు కాదు.. ఇక టి-20 మ్యాచ్‌లలో సెంచరీ చేస్తే అద్భుతం అంటూ ఆకాశానికెత్తేస్తారు. అలాంటిది ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడు టి-20 మ్యాచ్‌లో ఏకంగా 300 పరుగులు చేశాడు. ఢిల్లీలోని లలితా పార్కులో ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం మావి ఎలెవన్, ఫ్రెండ్స్ ఎలెవన్ జట్ల మధ్య టి-20 మ్యాచ్ జరిగింది. మావి ఎలెవన్ తరఫున ఆడిన 21 ఏళ్ల వికెట్ కీపర్ మొహిత్ అల్వాత్ ఈ మ్యాచ్‌లో పరుగుల వరదే సృష్టించాడు. కేవలం 72 బంతుల్లో 300 పరుగులు చేశాడు. ఇతని స్కోరులో 39 సిక్స్‌లు, 14 ఫోర్లున్నాయి. 18 ఓవర్లు ముగిసే సమయానికి మొహిత్ స్కోరు 250. కాగా, మిగతా 12 బంతుల్లో అతను ఏకంగా 60 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో వరసగా అయిదు సిక్స్‌లతో 34 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 416 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఫ్రెండ్స్ ఎలెవన్ జట్టు 216 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. కాగా, మొహిత్ ఇప్పటివరకు మూడు టి-20 మ్యాచ్‌లు ఆడగా, ఆ మూడు మ్యాచ్‌లలో కలిపి 5 పరుగులే చేయడం గమనార్హం. కాగా, ఈ మ్యాచ్‌లో గ్రౌండ్ సైజ్, బౌలర్ల క్వాలిటీ ఎంతన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.