క్రీడాభూమి

శ్రీలంకతో టి-20 సిరీస్ కోహ్లీకి విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: శ్రీలంకతో జరిగే టి-20 సిరీస్‌లో పాల్గొనే 15 మందితో కూడిన జట్టును జాతీయ సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిచ్చిన సెలక్టర్లు ఆల్‌రౌండర్ పవన్ నేగీకి జట్టులో అవకాశం కల్పించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగి టి-20 సిరీస్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన విషయం తెలిసిందే. అతను మూడు మ్యాచ్‌ల్లో 199 పరుగులు చేశాడు. ఫామ్‌లో ఉన్నప్పటికీ, వచ్చేనెల స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్ పోటీలను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు లంకతో సిరీస్ నుంచి అతనిని మినహాయించారు. కాగా, ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఆడిన పవన్ నేగీ, ఇటీవల జరిగిన ముస్తాక్ ఆలీ, దేవధర్ ట్రోఫీ ఈవెంట్స్‌లో చక్కటి ప్రతిభ కనబరిచాడు. కాగా, ఆస్ట్రేలియా టూర్‌లో విఫలమైన రిషీ ధావన్, ఉమేష్ యాదవ్, గుర్‌కీరత్ సింగ్ మాన్‌లను తప్పించిన సెలక్టర్లు భువనేశ్వర్ కుమార్‌కు చోటు కల్పించారు.
లంకతో జరిగే టి-20, వనే్డ సిరీస్‌ల కోసం మహిళల జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు.
భారత టి-20 జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే, మనీష్ పాండే, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, పవన్ నేగీ.

నంబర్ వన్ బ్యాట్స్‌మన్

టి-20 ర్యాంకింగ్స్‌లో 892 పాయంట్లు
దుబాయ్, ఫిబ్రవరి 1: భారత టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తాజాగా ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టి-20 ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన మూడు టి-20 మ్యాచ్‌ల్లో అతను వరుసగా 90 (నాటౌట్), 59 (నాటౌట్), 50 చొప్పున పరుగులు చేసి, 47 రేటింగ్ పాయింట్లు సంపాదించాడు. దీనితో అతను మొత్తం 892 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కాగా, ఫించ్ అడెలైడ్‌లో 44, మెల్బోర్న్‌లో 74 పరుగులు చేసి, 14 రేటింగ్ పాయింట్లను సంపాదించినప్పటికీ, కోహ్లీ అనూహ్యంగా దూసుకురావడంతో రెండో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో అలెక్స్ హాలెస్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, ఇతర భారత బ్యాట్స్‌మెన్‌లో సురేష్ రైనా మూడు స్థానాలను మెరుగుపరచుకొని 13, రోహిత్ శర్మ నాలుగు స్థానాలను అధిగమించి 16వ స్థానాన్ని ఆక్రమించారు.
బౌలింగ్ విభాగంలో శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్) మొదటి స్థానంలో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్‌కు ద్వితీయ స్థానం దక్కింది. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఆల్‌రౌండర్స్ విభాగంలో భారత్ తరఫున యువరాజ్ సింగ్ ఒక్కడికే స్థానం లభించింది. అతను ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో షకీబ్ అల్ హసన్, షహీద్ అఫ్రిదీ, షేన్ వాట్సన్ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌లో రాణించి, నంబర్ వన్ స్థానానికి ఎదిగిన కోహ్లీ