క్రీడాభూమి

పాక్ వనే్డ కెప్టెన్సీకి అజర్ అలీ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఫిబ్రవరి 9: పాకిస్తాన్ వనే్డ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి అజర్ అలీ వైదొలిగాడు. కాగా, అతని స్థానంలో సర్ఫ్‌రాజ్ ఖాన్‌కు పగ్గాలు అప్ప గించినట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్య క్షుడు షహర్యార్ ఖాన్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా టూర్‌లో పాక్ వైఫల్యాల నేపథ్యంలో అజర్‌కు ఉ ద్వాసన పలకాలన్న డిమాండ్ పెరిగింది. దాదాపు గా ఈ విషయాన్ని షహర్యార్ ఖాన్ ఇది వరకే తెలి పాడు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, వనే్డ కెప్టెన్‌గా అజర్ అలీ ఎంత వరకూ రాణించాడనే విషయంపై విశే్లషణ జరుపుతామని అతను ఇది వరకే ప్రకటించాడు. సిరీస్ మధ్యలో అతని కెప్టెన్సీ గురించి మాట్లాడడం భావ్యం కాదని, అందుకే అప్పట్లో వౌనంగా ఉన్నానని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ షహర్యార్ ఖాన్ చెప్పాడు. ఆసీస్ టూర్‌లో ఇప్పటికే నాలుగు వనే్డలు ఆడిన పాకిస్తాన్ 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. అజర్ కెప్టెన్సీ స్ఫూర్తిదాయకంగా లేదని, అందుకే జట్టులోని ఆటగాళ్లంతా నీరుగారి పోతున్నారని పలువులు మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తారు. వెంటనే అతనిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలన్న డిమాండ్ పెరిగింది. అందుకే ఆసీస్ పర్యటన ముగిసిన వెంటనే అజర్ అలీ కెప్టెన్సీని విశే్లషించాలని అనుకున్నామని, అయతే, అతనే స్వయంగా తన వద్దకు వచ్చి వనే్డ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు తెలిపాడని షహర్యార్ ఖాన్ వివరించాడు. అతని నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని, కొత్త కెప్టెన్‌గా సర్ఫ్‌రాజ్ ఖాన్‌ను ఎంపిక చేసినట్టు తెలిపాడు.

చిత్రం..అజర్ అలీ