క్రీడాభూమి

భారత్, ఇంగ్లాండ్ అండర్-19 మొదటి యూత్ టెస్టు డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఫిబ్రవరి 16: భారత్ అండర్-19, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగిన మొదటి యూత్ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగు రోజుల ఈ మ్యాచ్ మూడో రోజు ఇంగ్లాండ్ అండర్-19 ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన గురువారం ఆటను కొనసాగించి, 167 పరుగులకే ఆలౌటైంది.మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన జార్జి బార్ట్‌లెట్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ అండర్-19 బౌలర్ సియొమోన్ జోసెఫ్ 62 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్ అండర్-19ను దెబ్బతీశాడు. కాగా, 238 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ అండర్-19 మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. సురేష్ లోకేశ్వర్ 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, భారత్ అండర్-19ను గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అయితే, టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమై, ఒకానొక దశలో జట్టును ఓటమి అంచులోకి తీసుకెళ్లన కారణంగా, లోకేశ్వర్ ప్రయత్నాలు ఫలించలేదు.

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లాండ్ అండర్-19 మొదటి ఇన్నింగ్స్: 131.1 ఓవర్లలో 5 వికెట్లకు 501 డిక్లేర్డ్ (మాక్స్ హోల్డెన్ 170, జార్జి బార్ట్‌లెట్ 179, డెల్‌రే రాలిన్స్ 70 నాటౌట్, కనిష్క్ సేథ్ 2/85).
భారత్ అండర్-19 మొదటి ఇన్నింగ్స్: 122 ఓవర్లలో 8 వికెట్లకు 431 డిక్లేర్డ్ (అభిషేక్ గోస్వామి 66, సౌరభ్ సింగ్ 62, డారిల్ ఫెరారియో 117, సైమన్ జోసెఫ్ 62 నాటౌట్, హెన్రీ బ్రూక్స్ 2/75, లియామ్ పాటెర్సన్ వైట్ 2/104, యూసన్ ఉడ్స్ 2/55).
ఇంగ్లాండ్ అండర్-19 రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 23): 53 ఓవర్లలో 167 ఆలౌట్ (జార్జి బార్ట్‌లెట్ 68, సియెమోన్ జోసెఫ్ 6/62).
భారత్ అండర్-19 రెండో ఇన్నింగ్స్ (విజయ లక్ష్యం 238): సురేష్ లోకేశ్వర్ 92 నాటౌట్, డారిల్ ఫెరారియో 37, హెన్రీ బ్రూక్స్ 3/56).

చిత్రం.. మొదటి యూత్ టెస్టు చివరి రోజు ఆటలో భారత అండర్-19 ఆటగాడు రోహన్ కున్నుమ్మల్‌నును అవుట్ చేసిన ఇంగ్లాండ్ అండర్-19 బౌలర్ ఆరోన్ బియార్డ్‌కు సహచరుల అభినందన