క్రీడాభూమి

మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ విజయమే భారత్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 16: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఆధిపత్యాన్ని కనబరుస్తూ, ఇప్పటి వరకూ ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకెళుతున్న భారత్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సూపర్ సిక్స్‌లో మొదటి మ్యాచ్‌ని దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో సొంతం చేసుకున్న భారత్, అదే ఉత్సాహంతో బంగ్లాదేశ్‌పై పంజా విసరడానికి సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే, భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలు మెరుగుపతాయి. కాగా, మరో రెండు సూపర్ సిక్స్ మ్యాచ్‌లు కూడా శుక్రవారం జరుగుతాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది. పాకిస్తాన్, ఐర్లాండ్ జట్ల మధ్య చివరి సూపర్ సిక్స్ మ్యాచ్ ఉంటుంది. ఈనెల 19న మూడు సూపర్ సిక్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 21న జరిగే ఫైనల్‌లో ఢీ కొంటాయి.