క్రీడాభూమి

సూపర్ సెంట్రల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కీలక మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ విశేష ప్రతిభ కనబరచింది. సౌత్ జోన్‌తో జరిన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడి, రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ మొదలయ్యే సమయానికి సౌత్, సెంట్రల్ జోన్స్ చెరి రెండు విజయాలు (నాలుగు పాయింట్లు) సాధించి, సమవుజ్జీగా ఉన్నాయి. దీనితో, చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌ని గెలిచిన జట్టు రన్నరప్‌గా నిలవడం ఖాయమైంది. ఇరు జట్లు తీవ్రంగా పోటీపడిన నేపథ్యంలో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. కెప్టెన్ విజయ్ శంకర్ 40 పరుగులు సాధించగా, పవన్ దేశ్‌పాండే (35 నాటౌట్), విష్ణు వినోద్ (31) కూడా సౌత్ గౌరవ ప్రదమైన స్కోరును సాధించడంలో తమవంతు పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు చేజార్చుకొని 184 పరుగులు చేసింది. చివరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన ఈ పోరులో హర్‌ప్రీత్ సింగ్ 92 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అమన్‌దీప్ ఖరే 38 పరుగులు చేశాడు. చివరిలో అమిత్ మిశ్రా (12 నాటౌట్), అంకిత్ రాజ్‌పుత్ (5 నాటౌట్) సెంట్రల్ లక్ష్యాన్ని చేరడానికి సహకరించారు.