క్రీడాభూమి

అశ్విన్ నుంచి చాలా నేర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఫిబ్రవరి 21: టీమిండియా తురుపుముక్క అయిన ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌నుంచి తాను నేర్చుకోవలసింది ఎంతో ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అన్నాడు. అంతేకాదు తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడం కోసం అతని బౌలింగ్‌ను నిశితంగా గమనిస్తున్నట్లు కూడా అతను చెప్పాడు. ‘అశ్విన్ బౌలింగ్‌ను నేను చాలా చూశాను. అతను ప్రపంచస్థాయి బౌలర్. అతనినుంచి నేను ఎంతో నేర్చుకోవాలి’ అని ఆస్ట్రేలియా-్భరత్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు మంగళవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో లియోన్ చెప్పాడు. తాను ఏం నేర్చుకోబోతున్నదీ చెప్పబోనన్న అతను నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ఉపఖండం పరిస్థితులకు అనుగుణంగా తన అప్రోచ్‌ను మార్చుకున్నానని మాత్రం చెప్పగలనన్నాడు. ఇది ఎంతమేరకు ఫలితమిస్తుందో వేచి చూడాలన్నాడు. భారత్‌లో ఆడడం తమ జట్టు మొత్తానికి ఓ గొప్ప సవాలని కూడా అతను అంగీకరించాడు. కాగా, జట్టులో ప్రధాన బౌలర్‌గా అదనపు బాధ్యతలను తాను ఎంజాయ్ చేస్తున్నానని లియోన్ చెప్పాడు. ఇప్పటివరకు ఆడిన 63 టెస్టుల్లో లియోన్ 226 వికెట్లు సాధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుత ఆసీస్ జట్టు ఇప్పటివరకు భారత్ సందర్శించిన జట్లన్నిటిలోకి బలహీనమయిందని, భారత్ 4-0 తేడాతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తుందన్న మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంచనాలను లియోన్ కొట్టిపారేవాడు. ఎవరు ఏమనుకున్నా తాము పట్టించుకోమని, తమ జట్టులో కూడా చాలామంది మంచి ఆటగాళ్లున్నారని అంటూ, అయితే భారత్ టెస్టుల్లో నంబర్ వన్ అనే విషయం తమకు తెలుసునని, ఇది నిజంగా గొప్ప సవాలేనని అన్నాడు. కాగా, పుణె పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందన్న క్యురేటర్ అంచనాలను తాను నమ్మడం లేదని జట్టులో ఫాస్ట్‌బౌలర్ హేజల్‌వుడ్ అన్నాడు.

చిత్రం..విలేఖర్లతో మాట్లాడుతున్న లియోన్, హేజల్‌వుడ్