క్రీడాభూమి

పాక్ టెస్టు కెప్టెన్సీ రేసులో యూనిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఫిబ్రవరి 25: పాకిస్తాన్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా కొనసాగాలా లేదన్న విషయంలో మిస్బా ఉల్ హక్ ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడంతో, అతని స్థానంలో పగ్గాలను స్వీకరించాలని సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ ఆరాటపడుతున్నాడు. అతను రేసులో ఉన్నాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడపు షహర్యార్ ఖాన్ ప్రకటించడం విశేషం. అయితే, ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అతను ఫోన్ ద్వారా శనివారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. మిస్బా అభిప్రాయాన్ని తెలుకున్న తర్వాతే, ఈ విషయాన్ని చర్చిస్తామని అన్నాడు.

చిత్రం..యూనిస్ ఖాన్