క్రీడాభూమి

విశ్వవిజేత కెప్టెన్ లామ్ రిటైర్మెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, ఫిబ్రవరి 26: జర్మనీకి ఫుట్‌బాల్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను సాధించిపెట్టిన ఫిలిప్ లామ్ రిటైర్మెంట్ దాదాపు ఖాయమైంది. స్పోర్ట్స్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తానంటూ బయెర్స్ మ్యూనిచ్‌కి దరఖాస్తు చేసుకున్న లామ్ అభ్యర్థనపై అధికారులు సానుకూలంగా స్పందించలేదు. బయెర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్న లామ్ ఈ పరిణామంతో కంగుతున్నాడు. ఈ సీజన్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. 2014 ప్రపంచ కప్ సాకర్ ఫైనల్‌లో బ్రెజిల్‌పై విజయం సాధించి, ట్రోఫీని కైవసం చేసుకున్న జర్మనీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన లామ్ ఇంత వరకూ కెరీర్‌లో 113 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 33 ఏళ్ల లామ్ 1995లో, తన 11వ ఏట బయెర్న్ క్లబ్‌లో చేరాడు. 2003-04 మధ్య అతి కొద్దికాలం విఎఫ్‌బి స్టట్‌గార్డ్ తరఫున ఆడడాన్ని మినహాయిస్తే, అతని క్లబ్ కెరీర్ మొత్తం బయెర్న్‌తోనే కొనసాగింది. దీనితో స్పోర్ట్స్ డైరెక్టర్ హోదా తనకు దక్కుతుందని లామ్ ఆశించాడు. కానీ, క్లబ్ అధికారులు ఆ ప్రతిపాదనను నిరాకరించడంతో నిరాశ చెందిన లామ్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి, భవిష్యత్ గురించి ఆలోచిస్తానని ప్రకటించాడు.