క్రీడాభూమి

మెస్సీ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, ఫిబ్రవరి 27: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగా పోటీల్లో భాగంగా అట్లెటికో మాడ్రిత్‌తో తలపడిన బార్సిలోనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ కీలక గోల్‌తో బార్సిలోనాను గెలిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు పూర్తి రక్షణాత్మక వ్యూహాన్ని అమలు చేయడంతో ప్రథమార్ధంలో గోల్స్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ కొంత సేపు అదే పరిస్థితి కొనసాగింది. బార్సిలోనా ఆటగాడు రఫిన్సా ఈ డెడ్‌లాక్‌ను ఛేదిస్తూ 64వ నిమిషంలో గోల్ చేశాడు. అయితే, గోల్ చేసిన ఆనందం బార్సిలోనాకు ఎక్కువ సేపు లేకుండా, ఆరు నిమిషాల వ్యవధిలోనే అట్లెటికో మాడ్రిడ్‌కు డిగో గోడిన్ ఈక్వెలైజర్‌ను అందించాడు. దీనితో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ప్రత్యర్థి జట్టు రక్షణ వలయాన్ని ఎంతో చాకచక్యంగా దెబ్బతీసిన మెస్సీ 80వ నిమిషంలో బార్సిలోనాకు కీలక గోల్‌ను అందించాడు.