క్రీడాభూమి

సర్దార్‌కు చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లూథియానా: భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అయితే, తాను నిర్దోషినని, ఎలాంటి తప్పు చేయలేదని సర్దార్ స్పష్టం చేశాడు. బ్రిటిష్ మహిళా హాకీ జట్టులో సభ్యురాలిగా ఉన్న భారత సంతతికి చెందిన ఒక క్రీడాకారిణి లూథియానా పోలీస్ స్టేషన్‌లో సర్దార్‌పై ఫిర్యాదు చేసింది. అతను తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపించింది. నాలుగేళ్లుగా అతను తనతో సహజీవనం చేశాడని, తాను గర్భవతినని తెసుకొని అబార్షన్ చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడని పేర్కొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను అతను చెప్పినట్టుగానే అబార్షన్ చేయించుకున్నానని తెలిపింది. అయితే, ఆతర్వాత సర్దార్ తనను వదిలిపెట్టాడని, అన్ని విధాలా నష్టపోయిన తనకు న్యాయం చేయాలని కోరింది. చాలా సందర్భాల్లో సర్దార్ తనను బ్లాక్‌మెయిల్ చేశాడని 21 ఏళ్ల ఆ హాకీ క్రీడాకారిణి ఆరోపించింది. 2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో సర్దార్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, గత ఏడాది తమకు బిడ్డ పుట్టే అవకాశం ఉన్నా బలవంతంగా అబార్షన్ చేయించాడని తన ఫిర్యాదులో తెలిపింది. సర్దార్ తనను నమ్మించి మోసగించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరింది.
అయితే, బ్రిటిష్ హాకీ క్రీడాకారిణి చేసిన ఆరోపణలను సర్దార్ సింగ్ తోసిపుచ్చాడు. ఆమె తనకు తెలుసునని, అయితే, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని బుధవారం పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. ప్రస్తుతం తాను హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో జేపీ పంజాబ్ వారియర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నానని, తన దృష్టి మొత్తం ఆ టోర్నీపైనే కేంద్రీకృతమైందని తెలిపాడు. సదరు క్రీడాకారిణి తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిందని అన్నాడు. లాయర్‌ను సంప్రదించిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తానని చెప్పాడు. తనతో సహజీనం చేసినట్టు బ్రిటిష్ క్రీడాకారిణి చేసిన ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని అన్నాడు. ఆమెతో సహజీవనం చేయలేదని చెప్పాడు. ఆమె ఎందుకు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నదో, ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదని అన్నాడు.

భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్