క్రీడాభూమి

పేరుప్రఖ్యాతులు కాదు సరైన సూచనలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఫిబ్రవరి 27: ఎవరికి ఎంతటి పేరుప్రఖ్యాతులు ఉన్నాయన్నది ముఖ్యం కాదని, సరైన సూచనలిస్తూ అనుకున్న ఫలితాలను సాధించేందుకు కృషి చేయడమే కీలకమని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు స్పిన్ సలహాదారుగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ శ్రీ్ధరన్ శ్రీరాం స్పష్టం చేశాడు. టీమిండియాకు కేవలం 8 వనే్డల్లో ప్రాతినిథ్యం వహించిన శ్రీరాంను దాదాపు అందరూ మరచిపోయారు. అతని సేవలు అవసరమన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. అయితే, అతి తక్కువ కాలమే అంతర్జాతీయ క్రికెటర్‌గా కొనసాగినప్పటికీ, ఆతర్వాత కోచ్‌గా అతను ఎదిగాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అతనిని స్పిన్ కోచ్‌గా నియమించింది. అతని మార్గదర్శకంలోనే స్టీవ్ ఒకీఫ్, లియాన్ లాథమ్ ఏ విధంగా చెలరేగిపోయారన్నది మన కళ్లముందు కనిపిస్తున్న వాస్తవం. ఊరూపేరు లేని ఒక మాజీ స్పిన్నర్ కారణంగా ఆసీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారడం పొరపాటని వచ్చిన వార్తలపై శ్రీరాం స్పందించాడు. పేరు కంటే సరైన సూచనలు ఇవ్వడంలోనే గొప్పడనం ఉందన్నాడు. తన సేవలను కేవలం స్పిన్నర్లకు మాత్రమే పరిమితం చేయలేదని అతను స్పష్టం చేశాడు. అవసరమనుకున్నప్పుడు జట్టులోని ఏ ఆటగాడితోనైనా మాట్లాడి, సూచనలు చేసే అవకాశాన్ని చీఫ్ కోచ్ డారెన్ లీమన్ తనకు కల్పించాడని చెప్పాడు. అవసరాన్ని బట్టి తాను ఆటగాళ్లతో మాట్లాడేవాడనని, కొంత మంది తన సలహాలకు సానుకూలంగా స్పందిస్తే, మరి కొంత మంది కాదనేవారని అన్నాడు. ఎవరు ఏ విధంగా స్పందిస్తున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది వారికి చెప్పేవాడినని అన్నాడు. ఒకీఫ్ గురించి మాట్లాడుతూ, చెప్పింది శ్రద్ధగా విని, ఆచరణలో పెట్టడం అతని అలవాటని తెలిపాడు. ఆ నిబద్ధతే ఒకీఫ్‌ను మంచి స్పిన్నర్‌గా నిలబెడుతున్నదని శ్రీరాం అన్నాడు.

చిత్రం.. శ్రీ్ధరన్ శ్రీరాం