క్రీడాభూమి

వ్యూహం బెడిసికొట్టిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఫిబ్రవరి 27: స్పిన్‌తో ఆస్ట్రేలియాను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో, పిచ్‌ను అందుకు అనుకూలంగా రూపొందించడం ద్వారా టీమిండియా పన్నిన వ్యూహం బెడిసికొట్టిందా? స్పిన్ ట్రాక్‌ను ఆస్ట్రేలియా స్పిన్నర్లు గొప్పగా ఉపయోగించుకుంటారని భారత జట్టు మేనేజ్‌మెంట్ ఊహించలేదా? స్పిన్‌తో ఆసీస్‌ను పడగొట్టాలనుకొని, అదే స్పిన్ ధాటికి ఉక్కిరిబిక్కిరై ఓటమిని కొనితెచ్చుకుందా? మొదటి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే టీమిండియా కుప్పకూలిన విధానాన్ని పరిశీలిస్తే, ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే చెప్పాలి. గణాంకాలను పరిశీస్తే, పుణేలోని ఎంసిఎ పిచ్‌పై 19 మ్యాచ్‌లు జరిగాయి. పేసర్లు 401 వికెట్లు పడగొట్టారు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లను ఒకే బౌలర్ పడగొట్టిన సంఘటనలు పదకొండుకాగా, ఒక టెస్టులో పది వికెట్లను ఒక బౌలర్ సాధించిన సందర్భం ఒకటి ఉంది. స్పిన్నర్లకు ఈ పిచ్‌పై 90 వికెట్లు లభించాయి. ఒకరు మాత్రమే ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టగలిగాడు. ఏకపక్ష నిర్ణయాలు వెలువడిన సంఘ్ఠనలు తొమ్మిది. వీటిలో ఫాస్ట్ బౌలర్లకు 250 వికెట్లు దక్కితే, స్పిన్నర్లు కేవలం పదికొండు మాత్రమే. డ్రాగా ముగిసిన మ్యాచ్‌ల్లో పేసర్లు 151 వికెట్లు కూల్చారు. స్పిన్నర్లకు 62 వికెట్లు లభించాయి. తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లకు చెందిన పేసర్లు 160 వికెట్లు సాధిస్తే, స్పిన్నర్లు 18 వికెట్లకు కుదించుకుపోయారు. ఈ అంశాలన్నీ పుణే మైదానంపై పేసర్ల హవా కొనసాగిన వైనాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో స్పిన్నర్లదే పైచేయిగా మారింది. టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా స్పిన్ పిచ్‌ని తయారు చేయించి, తాను తీయించిన గోతిలో తానే పడింది.