క్రీడాభూమి

ఎంత బోనస్ ఇచ్చినా లాహోర్‌కు వెళ్లం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మార్చి 1: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో భారీ ధర పలికిన తైమల్ మిల్స్ సహా విదేశాలకు చెందిన పలువురు టి-20 స్పెషలిస్టులు లాహోర్‌లో జరుగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) ట్వంటీ-20 టోర్నమెంట్ ఫైనల్‌లో ఆడేందుకు నిరాకరించారు. భద్రతా పరమైన ఆందోళనలే ఇందుకు కారణం. బోనస్‌ల రూపంలో అదనంగా 10 వేల నుంచి 50 వేల అమెరికా డాలర్ల వరకు ముట్టజెపుతామని పిఎస్‌ఎల్ నిర్వాహకులు వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ లాహోర్‌కు వెళ్లేది లేదని వారు తెగేసి చెప్పారు. దీంతో లాహోర్‌లో పిఎస్‌ఎల్ ఫైనల్‌ను నిర్వహించడం ద్వారా తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల భద్రతకు ఢోకా ఉండదని ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెవిన్ పీటర్సన్ సహా ఇంగ్లాండ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు పిఎస్‌ఎల్ ఫైనల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరఫున ఆడాల్సి ఉంది. అయితే పీటర్సన్ ఇప్పటికే లండన్‌కు తిరుగు పయనమయ్యాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు ఫైనల్‌కు పోటీలో ఉన్న ఇతర విదేశీ ఆటగాళ్లు కూడా లాహోర్‌కు వెళ్లే అవకాశాలు లేవని అభిజ్ఞ వర్గాలు పిటిఐ వార్తా సంస్థకు తెలిపాయి. భద్రతను పణంగా పెట్టి లాహోర్‌కు వెళ్లడం తమకు ఇష్టం లేదని కరాచీ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వెస్టిండీస్ ఆటగాళ్లు క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, శ్రీలంక మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, అలాగే పెషావర్ జల్మీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న డేవిడ్ మలన్, క్రిస్ జోర్డాన్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న డ్వెయిన్ స్మిత్, శామ్యూల్ బద్రీ, బ్రాడ్ హాడిన్, షేన్ వాట్సన్, బెన్ డకెట్ తదితర ఆటగాళ్లు తమతమ యాజమాన్యాలకు స్పష్టం చేశారని, అలాగే విదేశీ కామెంటేటర్లు సైతం లాహోర్‌కు వెళ్లేందుకు సుముఖంగా లేరని ఆ వర్గాలు వెల్లడించాయి.