క్రీడాభూమి

సత్తా చాటిన మహిళా హాకీ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, మార్చి 2: భారత మహిళా హాకీ జట్టు మరోసారి సత్తా చాటుకుంది. గురువారం ఇక్కడ జరిగిన తొలి టెస్టులో 5-1 గోల్స్ తేడాతో బెలారస్ జట్టును మట్టికరిపించింది. భారత మహిళా జట్టు గత ఏడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ సాధించిన తర్వాత మళ్లీ మైదానంలోకి దిగడం ఇదే తొలిసారి. ఆరంభం నుంచే పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్ ద్వారా 11వ నిమిషంలో తొలి గోల్‌ను రాబట్టుకున్న భారత జట్టుకు నాలుగు నిమిషాల తర్వాత నవజ్యోత్ కౌర్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌ను అందించింది. దీంతో ఫస్ట్ క్వార్టర్ ముగిసే సమయానికే భారత జట్టు 2-0 గోల్స్ తేడాతో ఆధిక్యత సాధించింది. భారత్ ధాటికి ఆత్మరక్షణలో పడిన బెలారస్ జట్టు సెకెండ్ క్వార్టర్‌లో డిఫెన్స్‌కు పరిమితమైంది. అయినప్పటికీ 29వ నిమిషంలో పూనమ్ బర్లా అద్భుతమైన ఫీల్డ్‌గోల్ సాధించడంతో సెకెండ్ క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ ఆధిక్యత 3-0 గోల్స్‌కు పెరిగింది. అయితే 37వ నిమిషంలో బెలారస్‌కు స్వియత్లానా బహుసెవిచ్ ఏకైక గోల్‌ను అందించడంతో థర్డ్ క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ ఆధిక్యత 3-1 గోల్స్‌కు తగ్గింది. దీంతో చివరి క్వార్టర్‌లో విజృంభించి ఆడిన భారత జట్టుకు పెనాల్టీ కార్నర్ల ద్వారా 57వ నిమిషంలో కెప్టెన్ దీప్ గ్రేస్ ఎక్కా, 60వ నిమిషంలో గుర్జిత్ కౌర్ చెరో గోల్‌ను అందించడంతో 5-1 గోల్స్ తేడాతో బెలారస్ చిత్తుగా ఓడింది.

చిత్రం..మ్యాచ్‌లో ఓ రసవత్తర ఘట్టం