క్రీడాభూమి

భాగ్యనగరంలో రెండో అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: భాగ్యనగరంలో రెండవ క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్, టీమిండియా మాజీ ఆటగాడు వివిఎస్.లక్ష్మణ్ గురువారం ప్రకటించాడు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నానని, ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమయ్యే సమ్మర్ క్యాంప్‌తో ఈ అకాడమీలో ట్రైనింగ్ సెషన్ మొదలవుతుందని అతను విలేఖరులకు వెల్లడించాడు. ఇంతకుముందు హైదరాబాద్‌లోని శ్రీనిధి స్కూల్‌లో ఏర్పాటు చేసిన తొలి అకాడమీలో దాదాపు 90 మంది పొందుతున్నారని అతను తెలిపాడు. అలాగే చిన్నారుల ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో వచ్చే ఏడాది వేసవి నాటికి మరో రెండు అకాడమీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు లక్ష్మణ్ స్పష్టం చేశాడు.