క్రీడాభూమి

మళ్లీ ఓడిన జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకపుల్కో, మార్చి 3: మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్‌సీడ్ నోవాక్ జొకోవిచ్ అనూహ్యంగా మరోసారి ఘోర పరాజయం పాలయ్యాడు. కాగా, మాజీ నంబర్ వన్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ జపాన్ క్రీడాకారుడు యోషిహితో నిషియోకాపై వరస సెట్లలో విజయం సాధించి సెమీఫైనల్స్‌లో స్థానం సాధించాడు. ప్రపంచ ర్యాకింగ్స్‌లో నంబర్ 2 స్థానంలో ఉన్న జొకోవిచ్‌కు ఈ ఏడాదిలో ఇది రెండో ఓటమి. జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌లో అనూహ్యంగా ఓటమి పాలయినప్పటినుంచి జొకోవిచ్ మళ్లీ ఈ టోర్నమెంట్‌లోనే ఆడుతున్నాడు. తొలి రౌండ్‌లో స్లోవేకియాకు చెందిన మార్టిన్ క్లిజాన్‌పై గెలిచిన అతను రెండో రౌండ్‌లో ఆరో సీడ్ ఆటగాడు, ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిర్గోయిస్ చేతిలో 7-6(11/9), 7-5 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. దాదాపు గంటా 47 నిమిషాల పాటు సాగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 21 ఏళ్ల కిర్గియోస్ ఆధిక్యత కొట్టవచ్చనట్లు కనిపించింది. మొత్తం మ్యాచ్‌లో 25 ఏస్‌లు సర్వ్ చేసిన అతను ఫస్ట్ సర్వ్‌పాయింట్లలో 81 శాతం గెలుచుకోవడం గమనార్హం. కాగా, సెమీస్‌లో అతను మరో భారీ సర్వీసుల ఆటగాడు, అమెరికాకు చెందిన శామ్ క్వెర్రీని ఢీకొంటాడు.
మరో మ్యాచ్‌లో నాదల్ నిషియోకాపై 7-6(7/2), 7-3 స్కోరుతో వరస సెట్లలో గెలుపొంది సెమీస్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో అతను మూడో సీడ్ ఆటగాడు సిలిచ్‌ను ఎదుర్కొంటాడు.

చిత్రం.. నోవాక్ జొకోవిచ్