క్రీడాభూమి

బెంగళూరు టెస్టుకు పాండ్యా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 3: బెంగళూరులో శనివారం నుంచి ఆస్ట్రేలియాతో రెండో టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో తలపడే భారత జట్టుకు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. భుజం నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా సరైన ఫిట్‌నెస్‌తో లేకపోవడం వలన ఆసీస్‌తో రెండో టెస్టుకు దూరమయ్యాడని, అతను తప్ప మిగిలిన వారంతా సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నారని కోహ్లీ విలేఖరులకు చెప్పాడు. అయితే కంగారూలతో రెండో టెస్టులో తలపడే భారత తుది జట్టులో ఎవరెవరికి చోటు కల్పిస్తారన్న విషయాన్ని కోహ్లీ వెల్లడించలేదు. పుణె టెస్టులో కంగారూలతో తలపడిన భారత జట్టునే రెండో టెస్టుకు యథాతథంగా కొనసాగిస్తారా? లేక మార్పులేమైనా చేస్తారా? అని విలేఖరులు ప్రశ్నించగా, ఈ విషయాన్ని ఇప్పుడే వెల్లడించలేనని కోహ్లీ చెప్పాడు.