క్రీడాభూమి

వనే్డ సిరీస్ దక్షిణాఫ్రికాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, మార్చి 4: న్యూజిలాండ్‌తో ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్కులో శనివారం జరిగిన నిర్ణాయక చివరి వనే్డలో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్‌ను మట్టికరిపించి 3-2 తేడాతో ఈ సిరీస్‌ను గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు కివీస్ బ్యాట్స్‌మెన్‌ను సమర్థవంతంగా కట్టడి చేసింది. ప్రత్యేకించి కిగాసో రబాడ (3/25), ఇమ్రాన్ తాహిర్ (2/14), అండిల్ పెహ్లుక్వయో (2/35) నిప్పులు చెరిగే బంతులతో కివీస్ పతనాన్ని శాసించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో న్యూజిలాండ్ జట్టు ఘోరంగా విఫలమైంది. సఫారీల ధాటికి నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ డీన్ బ్రౌన్లీ (24) మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయగా, మిగిలిన వారిలో జిమీ నీషామ్ (24), మిచెల్ సాంట్నర్ (24), కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ (32) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు రాబట్టలేకపోవడంతో న్యూజిలాండ్ జట్టు 41.1 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు క్వింటోన్ డీకాక్ (6), హషీమ్ ఆమ్లా (8)తో పాటు సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ జెపి.డుమినీ (3) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరినప్పటికీ ఫఫ్ డుప్లెసిస్ (51-నాటౌట్) స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కెప్టెన్ ఎబి.డివిలియర్స్ (23)తో కలసి నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించిన డుప్లెసిస్ ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ (45-నాటౌట్))తో కలసి మిగిలిన పని పూర్తి చేశాడు. దీంతో 32.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా జట్టు మరో 106 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 25 పరుగులకే 3 వికెట్లు కూల్చి దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించిన కిగాసో రబాడ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.

చిత్రం..ట్రోఫీతో దక్షిణాఫ్రికా వనే్డ, టెస్టు క్రికెట్ జట్ల కెప్టెన్లు