క్రీడాభూమి

ఆ హామీలు నీటిపై రాతలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: రియో ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ సొంత రాష్టమ్రైన హర్యానా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన తనకు హర్యానా ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇప్పటివరకూ అందలేదని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘ఒలింపిక్స్‌లో దేశానికి పతకాన్ని తెస్తానని నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా. కానీ హర్యానా ప్రభుత్వం తన హామీని ఎప్పుడు నెరవేర్చుతుంది?’ ఒలింపిక్స్‌లో నేను పతకం సాధించిన తర్వాత హర్యానా ప్రభుత్వం చేసిన ప్రకటనలు నీటిపై రాతలేనా? కేవలం మీడియాలో ప్రచారం కోసమే నాకు ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించిందా? అని సాక్షి మాలిక్ ట్విట్టర్‌లో ప్రశ్నించింది. బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో గత ఏడాది జరిగిన ఒలింపిక్ క్రీడల్లో సాక్షి మాలిక్ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించడంతో ఆమెకు రూ.3.5 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించిన హర్యానా ప్రభుత్వం, అసలు ఈ క్రీడలు ప్రారంభం కావడానికి ముందే ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు గెలిచిన వారికి రూ.6 కోట్లు, రజత పతకాలను గెలిచిన వారికి రూ.4 కోట్లు, కాంస్య పతకాలను గెలిచిన వారికి రూ.2.5 కోట్ల చొప్పున నగదు పురస్కారాలను అందజేస్తామని ప్రకటించింది. అయితే ఆ హామీలను హర్యానా ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతో సాక్షి మాలిక్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది.