క్రీడాభూమి

బట్లర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లూంఫొంటెన్ (దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి 4: వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడిన తొలి వనే్డ ఇంటర్నేషనల్‌లో దక్షిణాఫ్రికాను ఇంగ్లాండ్ 39 పరుగుల తేడాతో ఓడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు సాధించింది. బట్లర్ శతకం, అలెక్స్ హాలెస్ (57), జో రూట్ (52), బెన్ స్టోక్స్ (57) అర్ధ శతకాలతో రాణించారు. బట్లర్ 76 బంతుల్లో, 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 105 పరుగులు సాధించాడు. కెరీర్‌లో అతనికి నాలుగో వనే్డ సెంచరీ. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్ 74 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. మర్చెంట్ డి లాంగ్, ఇమ్రాన్ తాహిర్ చెరి రెండు వికెట్లు సాధించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన ఆతర్వాత వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడింది. దీనితో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను 33.3 ఓవర్లకు కుదించిన అధికారులు డక్‌వర్త్-లూయిస్ విధానం ప్రకారం లక్ష్యాన్ని 290 పరుగులుగా నిర్ణయించారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడి వేగంగా శతకాన్ని సాధించినా, ఫఫ్ డు ప్లెసిస్ (55) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ పరుగుల వేటను కొనసాగించడంలో విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 33.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేయగా, అప్పటికి బెహర్డియన్ (4)తో కలిసి డి కాక్ (138) క్రీజ్‌లో ఉన్నాడు. 96 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 9 వికెట్లకు 399 (జాసన్ రోయ్ 48, హాలెస్ 57, జో రూట్ 52, బట్లర్ 105, బెన్ స్టోక్స్ 57, క్రిస్ మోరిస్ 3/74, మర్చెంట్ డి లాంగ్ 2/87, ఇమ్రాన్ తాహిర్ 2/71).
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ (లక్ష్యం 33.3 ఓవర్లలో 290): 33.3 ఓవర్లలో 5 వికెట్లకు 250 (క్వింటన్ డి కాక్ 138, ఫఫ్ డు ప్లెసిస్ 55).