క్రీడాభూమి

ఐర్లాండ్‌తో టి-20 సిరీస్ అఫ్గానిస్తాన్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా, మార్చి 8: తటస్థ వేదిక గ్రేటర్ నోయిడాలో బుధవారం జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న అఫ్గానిస్తాన్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. స్టువర్ట్ థాంప్సన్ 56, కెప్టెన్ విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ 39, గారీ విల్సన్ 41 (నాటౌట్) మెరుగైన స్కోర్లు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో అమీర్ హంజా 23 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేసి, ఈ సిరీస్‌లో శుభారంభం చేసింది. ఓపెనర్ మహమ్మద్ షజాద్ 47 పరుగులు చేయగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన సమీయుల్లా షెన్వారీ 26 బంతుల్లో 56 పరుగులు సాధించాడు.
మహిళల హాకీ టెస్టు సిరీస్
బెలారస్‌పై భారత్ క్లీన్‌స్వీప్
భోపాల్, మార్చి 8: బెలారస్‌తో జరిగిన మహిళల హాకీ టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన చివరి, ఐదో మ్యాచ్‌ని 3-1 తేడాతో కైవసం చేసుకొని, తనకు తిరుగులేదని నిరూపించింది. మ్యాచ్ ఆరో నిమిషంలోనే వందన కటారియా చేసిన గోల్‌తో ఖాతాను తెరచిన భారత్ చివరి వరకూ ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 15వ నిమిషంలో గుర్జిత్ కౌర్, 55వ నిమిషంలో రాణి గోల్స్ సాధించారు. భారత్‌ను కట్టడి చేసేందుకు చివరి వరకు ప్రయత్నించిన బెరాస్ ఒక గోల్ మాత్రమే చేయగలిగింది. 52వ నిమిషంలో యూలియా మిఖెచిక్ ద్వారా ఆ జట్టుకు గోల్ లభించింది.