క్రీడాభూమి

ఐసిసి ప్రపంచ ర్యాంకింగ్స్ టెస్టు బౌలింగ్‌లో అశ్విన్, జడేజా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 8: భారత స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అరుదైన ఘనతను అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో వీరిద్దరూ సంయుక్తంగా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించారు. 2008లో డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్ ఇదే విధంగా బౌలింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని పంచుకున్నారు. ఆతర్వాత ఇద్దరు బౌలర్లు సమానమైన పాయింట్లతో టాపర్లుగా నిలవడం ఇదే మొదటిసారి. అయితే, నంబర్ వన్ స్థానాన్ని ఇద్దరు స్పిన్నర్లు ఆక్రమించడం మాత్రం ఇదే మొదటిసారి. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 63 పరుగులకు ఆరు వికెట్లు కూల్చిన జడేజా రెండో ఇన్నింగ్స్‌లో మూడు పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. మొత్తం మీద అతను ఇప్పటి వరకూ 28 టెస్టులు (53 ఇన్నింగ్స్) ఆడి, 7,991 బంతులు వేశాడు. 3,025 పరుగులిచ్చాడు. 129 వికెట్లు పడగొట్టాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్, జడేజా చెరి 892 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానాన్ని ఆక్రమించారు. జొస్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా) 863 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇలావుంటే, బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 847 పాయింట్లతో మూడు, చటేశ్వర్ పుజారా 793 పాయింట్లతో ఆరు స్థానాల్లో ఉన్నారు. ఈ విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, జో రూట్ మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్, జడేజా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లలో అశ్విన్‌కు ఐదో స్థానం దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టిన అతని ఖాతాలో ఇప్పుడు మొత్తం 269 వికెట్లు ఉన్నాయి. బిషన్ సింగ్ బేడీ 266 వికెట్లతో ఇంత వరకూ ఐదో స్థానంలో ఉండగా, అతనిని అశ్విన్ ఆరో స్థానానికి నెట్టేశాడు. ఈ జాబితాలో ప్రస్తుత భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 132 టెస్టులు (236 ఇన్నింగ్స్) ఆడాడు. 40,850 బంతులు బౌల్ చేశాడు. 18,255 పరుగులిచ్చి, 619 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ 131 టెస్టులు (227 ఇన్నింగ్స్) ఆడి, 27,740 బంతులు వేశాడు. 12,867 పరుగులిచ్చిన అతను 434 వికెట్లు కూల్చాడు. మూడో స్థానంలో ఉన్న హర్భజన్ సింగ్ 103 టెస్టులు (190 ఇన్నింగ్స్) ఆడి, 28,580 బంతులు వేసి, 13,537 పరుగులకు 417 వికెట్లు సాధించాడు. జహీర్ ఖాన్ 92 టెస్టులు (165 ఇన్నింగ్స్)లో 18,785 బంతులు వేసి, 10,247 పరుగులిచ్చాడు. 311 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశ్విన్ ఇప్పటి వరకూ 47 టెస్టులు (88 ఇన్నింగ్స్) ఆడాడు. 13,835 బంతులు వేశాడు. 6,669 పరుగులిచ్చాడు. 269 వికెట్లు పడగొట్టాడు.

‘టాప్-10’ వీరే
1. రవిచంద్రన్ అశ్విన్ (్భరత్/ 892 పాయింట్లు), రవీంద్ర జడేజా (్భరత్/ 892 పాయింట్లు), 3. జొస్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా/ 863 పాయింట్లు), 4. రంగన హెరాత్ (శ్రీలంక/ 827 పాయింట్లు), 5. కాగిసో రబదా (దక్షిణాఫ్రికా/ 821 పాయింట్లు), 6. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా/ 819 పాయింట్లు), 7. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్/ 810 పాయింట్లు), 8. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్/ 803 పాయింట్లు), 9. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా/ 798 పాయింట్లు), 10. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా/ 757 పాయింట్లు).

బ్యాటింగ్‌లో ‘టాప్-10’
1. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా/ 936 పాయింట్లు), 2. జో రూట్ (ఇంగ్లాండ్/ 848 పాయింట్లు), 3. విరాట్ కోహ్లీ (్భరత్/ 847 పాయింట్లు), 4. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్/ 823 పాయింట్లు), 5. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా/ 794 పాయింట్లు), 6. చటేశ్వర్ పుజారా (్భరత్/ 793 పాయింట్లు), 7. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా/ 787 పాయింట్లు), 8. అజర్ అలీ (పాకిస్తాన్/ 779 పాయింట్లు), 9. యూనిస్ ఖాన్ (పాకిస్తాన్/ 772 పాయింట్లు), 10. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా/ 760 పాయింట్లు).
ఆల్‌రౌండర్స్‌లో ‘టాప్-10’
1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్/ 441 పాయింట్లు), 2. రవిచంద్రన్ అశ్విన్ (్భరత్/ 434 పాయింట్లు), 3. రవీంద్ర జడేజా (్భరత్/ 360 పాయింట్లు), 4. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా/ 332 పాయింట్లు), 5. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్/ 327 పాయింట్లు), 6. మోయిన్ అలీ (ఇంగ్లాండ్/ 312 పాయింట్లు), 7. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా/ 301 పాయింట్లు), 8. రంగన హెరాత్ (శ్రీలంక/ 220 పాయింట్లు), 9. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్/ 219 పాయింట్లు), 10. క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్/ 205 పాయింట్లు).