క్రీడాభూమి

ఐసిసి మహిళల వరల్డ్ కప్ భారత్ తొలి ప్రత్యర్థి ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 8: ఐసిసి మహిళల వరల్డ్ కప్‌లో భారత్ తన మొదటి మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఈ ఏడాది జూన్ 24 నుంచి మొదలయ్యే మహిళల వరల్డ్ కప్ పోటీలకు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వనుంది. కాగా, డెర్బీలో జరిగే మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొంటున్న భారత్ ఆతర్వాత 29న వెస్టిండీస్‌తో టాంటన్‌లో తలపడుతుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే మ్యాచ్ జూలై 2న డెర్బీలో జరుగుతుంది. ఆ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్ ఎదుర్కొంటుంది. జూలై 5న శ్రీలంకతో డెర్బీలో, 8న దక్షిణాఫ్రికాతో లిసెస్టర్‌లో, 12న ఆస్ట్రేలియాతో బ్రిస్టల్‌లో, 15న న్యూజిలాండ్‌తో డెర్బీలో గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టోర్నీ సెమీ ఫైనల్స్ 18 నుంచి మొదలవుతాయి. టైటిల్ పోరు 23న లార్డ్స్ మైదానంలో జరుగుతుంది.

భుజం గాయంతో
మిచెల్ మార్ష్ అవుట్
బెంగళూరు, మార్చి 8: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ భుజం గాయం కారణంగా చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. తదుపరి చికిత్స కోసం అతను స్వదేశానికి వెళ్లనున్నట్టు ఆస్ట్రేలియా ఫిజియోథెరపిస్టు డేవిడ్ బీక్లే తెలిపాడు. చాలాకాలం ఫిట్నెస్ సమస్యలతో బాధపడిన మిచెల్ మార్క్ ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే, మరోసారి అతను భుజానికి గాయమైందని, వైద్య నిపుణుల సూచన తీసుకున్న తర్వాతగానీ అతను మళ్లీ ఎప్పుడు జాతీయ జట్టుకు సేవలకు సిద్ధంగా ఉంటాడో చెప్పలేమని బీక్లే తెలిపాడు. భారత్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికి రెండు టెస్టులు పూర్తికాగా, ఇరు జట్లు చెరొక విజయంతో సమవుజ్జీలుగా ఉన్న విషయం తెలిసిందే.

ఎల్గార్ అజేయ శతకం
దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 229
న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు
డ్యునెడిన్, మార్చి 8: న్యూజిలాండ్‌తో బుధవారం మొదలైన మొదటి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు 229 పరుగులు చేసింది. డీన్ ఎల్గార్ 128 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అతనితోపాటు టెంబా బవూమా 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అంతకు ముందు కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ 52 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా, ఓపెనర్ స్టెఫెన్ కుక్ (3), షహీం ఆమ్లా (1), జీన్ పాల్ డుమినీ (1) సింగిల్ డిజిట్స్‌కే అవుటయ్యారు.