క్రీడాభూమి

‘బుద్ధిక్షయం’ వివాదంపై ఐసిసికి బిసిసిఐ లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 8: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మెదడు మొద్దుబారుతున్నదని, అందుకే, నిబంధనలకు విరుద్ధంగా అతను డిఆర్‌ఎస్ అప్పీల్స్ సమయంలోనూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సపోర్టింగ్ స్ట్ఫా సూచనల కోసం ఎదురుచూస్తున్నాడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన విమర్శలు సంచలనం రేపుతున్నాయి. తాను పొరపాటు చేశానని, నిజానికి డిఆర్‌ఎస్ అప్పీల్ చేయకుండా మైదానంలో నిలబడడం తన తప్పేనని, ఆ సమయంలో తనకు ఏమీ తోచలేదని స్టీవెన్ స్మిత్ అంగీకరించడంతో, ఈ సంఘటనను మీడియా ‘బుద్ధిక్షయం’ వివాదంగా అభివర్ణించింది. కాగా, ఈ వివాదానికి మద్దతుగా నిలిచి, కోహ్లీ ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) దృష్టికి తీసుకెళ్లినట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) తెలిపింది. వీడియో రీప్లేలు చూసిన తర్వాత, కోహ్లీకి అండగా నిలవాలని తీర్మానించినట్టు బిసిసిఐ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అందుకే, ఐసిసి మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్టు వివరించింది. స్మిత్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడన్న కోహ్లీ ఆరోపణలను సమర్థిస్తున్నట్టు తెలిపింది. ‘ఆ క్షణంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. నా మెదడు మొద్దుబారిపోయింది. అందుకే, అంపైర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత కూడా మైదానంలోనే ఉండిపోయాను’ అంటూ స్మిత్ ఇచ్చిన వివరణను బిసిసిఐ ఈ సందర్భంగా ప్రస్తావించింది. పొరపాటు చేసినట్టు ఆసీస్ కెప్టెన్ స్వయంగా అంగీకరించాడని, కాబట్టి అతనిపై చర్య తీసుకోవాలని కోరింది. ఇలావుంటే, బిసిసిఐ ఫిర్యాదుపై 48 గంటల్లోగా క్రిస్ బ్రాడ్ స్పందించాల్సి ఉంది. అతను ఈ సంఘటనను ఏ విధంగా చూస్తాడో, స్మిత్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.
కోహ్లీ ఆరోపణల్లో నిజం లేదు: లీమన్
బెంగళూరు: అంపైర్ నిర్ణయాలను సవాలు చేసే డిఆర్‌ఎస్ అప్పీల్స్‌కు వెళ్లే ప్రతిసారీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూస్తూ, అక్కడి నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నారంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఆరోపణలను డారెన్ లీమన్ ఖండించాడు. కోహ్లీ మాటల్లో ఏమాత్రం నిజం లేదని ఆసీస్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ లీమన్ స్పష్టం చేశాడు. అతని అభిప్రాయాలు అతనికి ఉంటే, తమ అభిప్రాయాలు తమకు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకూ ఎన్నడూ సపోర్టింగ్ స్ట్ఫా సూచనలను మైదానంలో ఉన్న ఆటగాళ్లు కోరలేదని, ఇక ముందు కూడా అడగబోరని ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లీమన్ అన్నాడు. కోహ్లీ ఆరోపణలను తనను దిగ్భ్రాంతికి గురి చేశాయని చెప్పాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా, మ్యాచ్‌ని ఆసీస్ ఆటగాళ్లు ఆద్యంతం ఆస్వాదించారని అన్నాడు. క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరూ వ్యవహరించలేదని అతను తేల్చిచెప్పాడు.