క్రీడాభూమి

విలియమ్‌సన్ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్యునెడిన్, మార్చి 9: కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తూ, అజేయంగా 85 పరుగులు సాధించడంతో, దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 177 పరుగులు చేయగలిగింది. అంతకు ముందు నాలుగు వికెట్లకు 229 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 122.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. డీన్ ఎల్గార్ 140 పరుగులు చేయగా, టెంబా బవూమా 64 పరుగులు సాధించాడు. టెయిలెండర్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా ముందుగా ఊహించినంత భారీ స్కోరు చేయలేకపోయింది. కాగా, కివీస్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆశాజనంగా మొదలుకాలేదు. టామ్ లాథమ్ 10 పరుగులు చేసి వెర్నన్ ఫిలాండర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ క్వింటన్ డికాక్‌కు చిక్కడంతో ఆ జట్టు 15 పరుగుల వద్ద మొదటి వికెట్ చేజార్చుకుంది. ఈ దశలో జీత్ రావెల్ (52)తో కలిసి విలియన్‌సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రెండో వికెట్‌కు 102 పరుగులు జోడించిన తర్వాత కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో డీన్ ఎల్గార్‌కు చిక్కిన రావెల్ పెవిలియన్ చేరాడు. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ ఎనిమిది పరుగులు చేసి, రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. హెన్రీ నికోల్స్ 12 పరుగులకే కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లోనే షహీం ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ మూడు వికెట్లకు 177 పరుగులు చేయగా, విలియమ్‌సన్ 78, జీతన్ పటేల్ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.