క్రీడాభూమి

బంగ్లాపై లంకకు ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, మార్చి 9: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక 182 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 494 పరుగుల భారీ స్కోరును లంక సాధించిన విషయం తెలిసిందే. ఆతర్వాత తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 133 పరుగులు చేయగా, సౌమ్య సర్కార్ (66), కెప్టెన్ ముష్ఫికర్ రహీం (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు, గురువారం ఉదయం ఆటను కొనసాగించిన ఆ జట్టు 308 పరుగులకు ఆలౌటైంది. సౌమ్య సర్కార్ 71 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ పతనం ఆరంభమైంది. ముష్ఫికర్ రహీం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, 85 పరుగులు సాధించగా, లోయల్ ఆర్డర్‌లో మెహదీ హసన్ మీర్జా 41 పరుగులు చేశాడు. 97.2 ఓవర్లలో బంగ్లాదేశ్ 312 పరుగులు చేసి ఆలౌటైంది. రంగన హెరాత్, దిల్‌రువాన్ పెరెరా చెరి మూడు వికెట్లు పడగొట్టారు. కాగా, లంక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం కురవడంతో, లంక రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టకుండానే ఆటను నిలిపేశారు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 129.1 ఓవర్లలో 494 ఆలౌట్ (కుశాల్ మెండిస్ 194, అసెల గుణరత్నే 85, నిరోషన్ డిక్‌విల్లా 75, దిల్‌రువాన్ పెరెరా 51, మెహదీ హసన్ 4/113, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/68).
బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 2/133): 55 ఓవర్లలో 3 వికెట్లకు 177 (తమీమ్ ఇక్బాల్ 57, సౌమ్య సర్కార్ 71, ముష్ఫికర్ రహీం 85, మెహదీ హసన్ మీర్జా 41, దిల్‌రువాన్ పెరెరా 3/53, రంగన హెరాత్ 3/72).