క్రీడాభూమి

విలియమ్‌సన్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్యునెడిన్, మార్చి 10: కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ విజృంభణ న్యూజిలాండ్‌ను ఆదుకుంది. సెంచరీతో అతను రాణించి, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తన జట్టు 33 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించడంలో ముఖ్యభూమిక పోషించాడు. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 177 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు, శుక్రవారం ఆటను కొనసాగించి 341 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్‌సన్ 241 బంతులు ఎదుర్కొని, 18 ఫోర్లతో 130 పరుగులు చేశాడు. కెరీర్‌లో అతనికి ఇది 16వ శతకం. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ బ్రాడ్లే వాల్టింగ్ 50 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ 94 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి, కివీస్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. వెర్నన్ ఫిలాండర్, మోర్న్ మోర్కెల్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
కాగా, కివీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి స్టెఫెన్ కుక్ (0) వికెట్‌ను కోల్పోయి 38 పరుగులు చేసింది. డీన్ ఎల్గార్ (12), హషీం ఆమ్లా (23) క్రీజ్‌లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 122.4 ఓవర్లలో 308 ఆలౌట్ (డీన్ ఎల్గార్ 140, ఫఫ్ డు ప్లెసిస్ 52, టెంబా బవూమా 64, ట్రెంట్ బౌల్ట్ 4/64, నీల్ వాగ్నర్ 3/88, జీతన్ పటేల్ 2/85).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 177): 114.3 ఓవర్లలో 341 ఆలౌట్ (కేన్ విలియమ్‌సన్ 130, జీత్ రావల్ 52, బ్రాడ్లే వాల్టింగ్ 50, కేశవ్ మహారాజ్ 5/94, వెర్నన్ ఫిలాండర్ 2/67, మోర్న్ మోర్కెల్ 2/62).
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 (డీన్ ఎల్గార్ 12 నాటౌట్, హషీం ఆమ్లా 23 నాటౌట్).

చిత్రం..కేన్ విలియమ్‌సన్ (130)