క్రీడాభూమి

ఫామ్‌లోకి వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 10: ఇటీవల కాలంలో కొంత వెనుకబడిన మాట వాస్తవమేనని, అయితే, త్వరలోనే మళ్లీ ఫామ్‌లోకి వస్తానని టెన్నిస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో బై లభించిన జొకోవిచ్ రెండో సెట్‌లో మ్యాచ్‌కి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నానని, మళ్లీ గతంలో మాదిరి ఫలితాలు సాధించడం ఏ మాత్రం అసాధ్యం కాదని వ్యాఖ్యానించాడు. 2016 ఆరంభంలో అద్భుతంగానే ఆడిన ఈ మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆతర్వాత ఫామ్‌ను కోల్పోయాడు. వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లో ఫైనల్స్ వరకూ చేరినా, ప్రస్తుత ప్రపం చ నంబర్ వన్ ఆండీ ముర్రే చేతిలో పరాజయాలను చవిచూశాడు. ఈ ఏడాది ఆరంభంలోనూ అతనికి చేదు అనుభవమే ఎదురైంది. ఆస్ట్రేలి యా ఓపెన్ రెండో రౌండ్‌లోనే అనూహ్యంగా అతను డెనిస్ ఇస్టోమిన్ చేతిలో ఓడాడు. ఆతర్వాత అకాపల్కో టోర్నీలో ఆస్ట్రేలియాకు చెంది న యువ ఆటగాడు నిక్ కిర్గియోస్‌ను క్వార్టర్ ఫైనల్స్‌లో ఢీకొని పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అయితే, ఈ ఫలితాలు తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేదని జొకోవిచ్ స్పష్టం చేశాడు. త్వరలోనే ఫామ్‌లోకి వస్తానని అన్నాడు. ఇండియన్ వెల్స్ టోర్నీలో జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, కిర్గియోస్, అలెగ్జాండర్ జ్వెరెవ్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన గ్రూప్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, ఇలాంటి డ్రాలు తనకు చాలాసార్లు ఎదురయ్యాయని అన్నాడు. షెడ్యూల్‌నుగానీ, డ్రానుగానీ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదన్నాడు.