క్రీడాభూమి

టి-20 ఫార్మాట్‌కు ప్రత్యేక సెలక్షన్ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, మార్చి 10: టెస్టు, వనే్డ ఇంటర్నేషనల్స్‌లో మెరుగ్గానే ఉన్నప్పటికీ, టి-20 ఫార్మాట్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడాన్ని గమనించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ప్రత్యేక సెలక్షన్ కమిటీని నియమించింది. టి-20 ఫార్మాట్‌కు మాజీ క్రికెటర్ మార్క్‌వాను సెలక్షన్ కమిటీలోకి తీసుకుంది. టెస్టు, వనే్డ ఫార్మాట్స్‌లో చీఫ్ సెలక్టర్‌గా ట్రెవర్ హార్న్స్ తన బాధ్యతలను కొనసాగించనున్నాడు. యువ టాలెంట్‌ను గుర్తించి, ప్రోత్సహించే కమిటీకి మేనేజర్‌గా వ్యవహరిస్తున్న గ్రెగ్ చాపెల్, జాతీయ జట్టు కోచ్ డారెన్ లీమన్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారు. కాగా, టి-20 ఫార్మాట్‌కు సెలక్షన్ కమిటీకి చీఫ్‌గా మార్క్ వాను సిఎ ఎంపిక చేసింది. ఈ కమిటీలోనూ లీమన్ సభ్యుడిగా కొనసాగుతాడు. 2016లో జరిగిన టి-20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు దారుణంగా విఫలమైన తర్వాత, మార్పులకు సిఎ దృష్టి సారించింది. అందులో భాగంగానే టి-20 ఫార్మాట్‌కు ప్రత్యేకంగా ఒక సెలక్షన్ కమిటీని నియమించి, దానికి చీఫ్‌గా మార్క్ వాను నియమించింది. ఈ మార్పులు ఎంత వరకూ సత్ఫలితాన్నిస్తాయో చూడాలి.