క్రీడాభూమి

స్టొయినిస్ x మాక్స్‌వెల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 13: భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టుల్లో ఆడే అవకాశాన్ని దక్కించుకోవడానికి విక్టోరియా ఆటగాళ్లు మార్కస్ స్టొయినిస్, గ్లేన్ మాక్స్‌వెల్ తీవ్రంగా పోటీపడుతున్నారు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయపడడంతో, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేది ఎవరన్నది ఆసక్తి రేపుతున్నది. ఇద్దరూ దేశవాళీ పోటీల్లో అద్భుతంగా రాణించడం, ఆల్‌రౌండర్లుగా పేరుతెచ్చుకోవడం ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. మాక్స్‌వెల్ ఇప్పటికే ఆసీస్ జట్టుతో ఉన్నాడు. స్టొయినిస్ ఇప్పుడు మిచెల్ మార్ష్ ఖాళీని భర్తీ చేస్తాడు. టూర్‌లో కొనసాగుతూ, పిచ్‌ల తీరుతెన్నులను, టీమిండియా బలాబలాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మాక్స్‌వెల్‌కే తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

చిత్రం..మార్కస్ స్టొయినిస్