క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టెన్నిస్ ప్రీ క్వార్టర్స్‌లో వీనస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 14: ప్రపంచ మాజీ నెంబర్ వన్, ప్రస్తుత 12వ ర్యాంక్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె లూసీ సఫరోవాను 6-4, 6-2 తేడాతో వరు సెట్లలో ఓడించింది. తన సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి 2001 నుంచి 2014 వరకు ఈ టోర్నీని బాయ్‌కాట్ చేసిన వీనస్ మనసు మార్చుకొని, మళ్లీ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టింది. అయితే, గత రెండు ప్రయత్నాల్లో టైటిల్ సాధించలేకపోయిన ఆమె, మూడోసారి అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ఆడుతున్నది. సెరెనా గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో, టైటిల్ రేసులో వీనస్ కూడా ఉంది. కాగా, మరో కీలక మ్యాచ్‌లో మాడిసన్ కీస్ 6-1, 6-4 తేడాతో నవోమీ ఒసాకాపై విజయం సాధించింది. 13వ సీడ్ కరోలిన్ వొజ్నియాకి 6-3, 6-1 తేడాతో కాటెరీన సినియకొవాను ఓడించింది. రెండో సీడ్ ఏంజెలిక్ కెర్బర్ 7-5, 3-6, 7-5 తేడాతో పాలిన్ పార్మెంటియర్‌పై గెలుపొందింది. లారా డావిస్ 6-1, 6-4 స్కోరుతో జూలియా జార్జస్‌పై గెలిచింది.
స్టార్ల ఓటమి
మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో స్టార్ క్రీడాకారిణులు అగ్నిస్కా రద్వాన్‌స్కా, సిమోనా హాలెప్, ఎలెనా వెస్నినా పరాజయాలను చవిచూసి నిష్క్రమించారు. ఆరోసీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కాపై షుయ్ పెంగ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ని ఆమె 6-4, 6-4 తేడాతో సొంతం చేసుకొని, ప్రీ క్వార్టర్స్ చేరింది. నాలుగో సీడ్ హాలెప్‌ను 28వ ర్యాంక్ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాడెనొవిచ్ 6-3, 6-3 తేడాతో ఓడించింది. 14వ సీడ్ వెస్నినాపై 25వ ర్యాంకర్ తిమియా బబోస్ 6-4, 1-6, 6-4 స్కోరుతో విజయం సాధించింది.

చిత్రం..వీనస్ విలియమ్స్