క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టెన్నిస్ టాప్ సీడ్స్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 15: ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో టాప్ స్టార్లు ప్రీ క్వార్టర్స్ చేరారు. రెండో ర్యాంక్ ఆటగాడు, టైటిల్ ఫేవరిట్ నొవాక్ జొకోవిచ్ 7-5, 4-6, 6-1 ఆధిక్యంతో జువాన్ మార్టిన్ డెల్ పొట్రోను ఓడించాడు. మొదటి సెట్‌ను సాధించడానికి ఎంతో కష్టపడిన జొకోవిచ్ రెండో సెట్‌లో పోరాడినప్పటికీ ఓటమిపాలయ్యాడు. అయితే, చివరిదైన మూడో సెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, ప్రత్యర్థి డెల్ పొట్రోను చిత్తు చేశాడు. నాలుగో సీడ్ కెయ్ నిషికొరీ 6-2, 6-2 తేడాతో గిలెస్ ముల్లర్‌పై సునాయాంగా గెలిచాడు. నిషికొరి విజృంభణకు ముల్లర్ ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయాడు. ఐదోసీడ్ ఆటగాడు రాఫెల్ నాదల్ కూడా ప్రీ క్వార్టర్స్ చేరాడు. అతను ఫెర్నాండో వెర్డాస్కోపై 6-3, 7-5 ఆధిక్యంతో గెలిచాడు. తొమ్మిదోసీడ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ 7-6, 7-6 తేడాతో స్టీవ్ జాన్సన్‌పై విజయం సాధించాడు. కాగా, 12వ ర్యాంక్ ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ ఓటమిపాలై వెనుదిరిగాడు. జాక్ సాక్ అతనిని 3-6, 6-3, 7-6 స్కోరుతో ఓడించాడు. 15వ ర్యాంకర్ నిక్ కిర్గియోస్ 6-3, 6-4 తేడాతో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయాన్ని నమోదు చేశాడు. టేలర్ ఫ్రిట్జిపై మాలెక్ జజిరీ విజయం సాధించాడు.
సానియా జోడీ ఓటమి
మహిళల డబుల్స్ విభాగంలో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రయికోవాతో కలిసి బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. సానియా, బార్బరా జోడీపై మార్టినా హింగిస్, యంగ్ జాన్ చాన్ జోడీ 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో గెలిచి, సెమీస్ చేరింది.

కెర్బర్‌కు వెస్నినా షాక్
ఇండియన్ వెల్స్: ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి ఏంజిలిక్ కెర్బర్ ప్రీ క్వార్టర్‌లోనే చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ టైటిల్ సాధించే సత్తావున్న క్రీడాకారిణిగా బరిలోకి దిగిన ఆమెను 14వ సీడ్ ఎలెనా వెస్నినా ఓడించి సంచలనం సృష్టించింది. ప్రీ క్వార్టర్స్‌లో వెస్నినా ఎవరూ ఊహించని రీతిలో కెర్బర్‌పై 6-3, 6-3 తేడాతో విజయభేరి మోగించి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. మూడో సీడ్ కరొలినా ప్లిస్కోవా తన ప్రత్యర్థి తిమియా బస్కిన్జీపై మొదటి సెట్‌లో 5-1 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈదశగా కాలి కండరాలు బెణకడంతో బస్కిన్జీ మ్యాచ్ నుంచి వైదొలగింది. ప్లిస్కోవాకు క్వార్టర్స్‌లో చోటు దక్కింది. ఐదో సీడ్ డొమినికా సిబుల్కొవా 6-4, 3-6, 6-2 తేడాతో అనస్తాసియా పవ్లిచెన్కొవాను, ఏడో సీడ్ గార్బినె ముగురుజా 7-6, 1-6, 6-0 ఆధిక్యంతో ఎలినా స్విటోలినాను, ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా 6-4, 6-4 తేడాతో కరోలిన్ గార్సియాను, తొమ్మిదో సీడ్ మాడిసన్ కీస్ 6-4, 6-4 స్కోరుతో మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకిని ఓడించి ముందంజ వేశారు. 12వ సీడ్‌గా ఆడుతున్న వీనస్ విలియమ్స్ 3-6, 6-1, 6-3 ఆదిక్యతో షుయ్ పెంగ్‌పై గెలిచింది. మరో మ్యాచ్‌లో క్రిస్టినా మ్లాడినొవిచ్‌పై లారెన్ డావిస్ 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.